బ్రేకింగ్ : వంగవీటి రాజకీయం ఒక ముగిసిన అధ్యాయమేనా..?

Monday, July 22nd, 2019, 09:13:41 AM IST

విజయవాడ రాజకీయాల్లో విషయానికి వస్తే వంగవీటి కుటుంబ ప్రస్తావన లేకుండా ఆ చర్చలు సమాప్తం కావు. అలాంటి రాజకీయ చరిత్ర కలిగిన వంగవీటి కుంటుంబం ఇక రాజకీయంగా ఎదగలేక, రోజు రోజుకి తమ ప్రభని కోల్పోతుందా అంటే అవుననే సమాధానం వస్తుంది. వంగవీటి రంగా వారసుడిగా 2004 లో రాజకీయ ప్రస్థానం మొదలుపెట్టిన వంగవీటి రాధా మొదటిసారి గెలిచి ఘనంగా తన అరంగ్రేటం మొదలుపెట్టాడు, అయితే ఆ తర్వాత అతను వేసిన తప్పటడుగులు మూలంగా ప్రస్తుతం అతని రాజకీయ జీవితం అగమ్యగోచరంగా మారిపోయింది.

2009 లో రాజశేఖర్ రెడ్డి ఎంత చెప్పిన వినకుండా చిరంజీవి మీద నమ్మకంతో, వాళ్ళ కులపోళ్ల గెలిపిస్తారనే ఆశతో ప్రజారాజ్యంలో చేరి ఓడిపోయాడు. ఆ తర్వాత చాలా రోజులు సైలెంట్ గా ఉండిపోయిన రాధా, 2014 లో వైసీపీ తరుపున పోటీచేసి ఓడిపోయాడు..ఓడిపోయినా కానీ వైసీపీలో అతనికి తగిన గుర్తింపు లభించేది. ఆ తర్వాత 2019 ఎన్నికలో తనకి సెంట్రల్ సీటు కావాలని పట్టుపడ్డాడు, దానికి జగన్ ఒప్పుకోలేదు, కావాలంటే మరో చోట ఎమ్మెల్యేగా లేదా, ఎంపీగా ఇస్తానన్న ఒప్పుకోకుండా టీడీపీ లోకి వెళ్ళిపోయాడు .

అక్కడ కూడా ఆయనకి మొండిచెయ్యి ఎదురైంది, సరే టికెట్ లేకపోయినా పార్టీ గెలిస్తే MLC పదవి వస్తుందని ఆశించాడు. కానీ పార్టీ ఘోరంగా ఓడిపోవటంతో రాధాకి మౌనమే మార్గం అయ్యింది. ఇక ఇప్పుడు బీజేపీ పార్టీ రాధని పార్టీలోకి పిలుస్తుంది. దానిలోకి పోతాడో లేదో చూడాలి. ఇలా రాధా తీసుకుంటున్న నిర్ణయాల వలన ఆయన రాజకీయ జీవితం పడిపోవటమే కాకుండా, ఆ కుటుంబ అభిమానులు కూడా దూరం అవుతున్నారు. మరి ఈ గడ్డు పరిస్థితి నుండి రాధా ఎలా బయటపడుతాడో చూడాలి.