నిధులను బట్టే విధులు

Monday, September 15th, 2014, 12:09:38 PM IST


కేంద్ర పట్టణాభివృద్ధిశాఖా మంత్రి వెంకయ్య నాయుడు విజయవాడలో స్మార్ట్ సిటీలపై చాంబర్ ఆఫ్ కామర్స్సమావేశాన్ని ప్రారంభించి ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణాల అభివృద్ధి దేశానికి తలమానికం కావాలని పేర్కొన్నారు. అలాగే సాఫ్ట్ వేర్ ద్వారా ప్రజలకు పారదర్శక పాలన అందించాలని విజ్ఞ్యప్తి చేశారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ నిధులను బట్టే విధులు ఉంటాయని, పన్నులు లేకుండా పనులు ఉండవని తెలిపారు. అలాగే ప్రజలకు మెరుగైన సేవలు అందిస్తే పన్నులు చెల్లించడానికి వారే ముందుకు వస్తారని వెంకయ్య అభిప్రాయపడ్డారు. ఇక సరైన పాలన లేకపోతే అభివృద్ధి సాధ్యం కాదని, ఆలోచనా విధానంలో మార్పులు లేకపోతే పట్టణాలు మురికికూపాలేనని వెంకయ్య స్పష్టం చేశారు.