రేవంత్ రేంజు పెరిగింది : నీకోసమే చూస్తున్నా..! కేసీఆర్ ముందే రేవంత్ తో గవర్నర్

Friday, August 16th, 2019, 11:48:54 AM IST

తెలంగాణలో సీఎం కేసీఆర్ తర్వాత క్రేజ్ ఉన్న నేత ఎవరయ్యా అంటే అది ఖచ్చితంగా రేవంత్ రెడ్డి అని చెప్పాలి. టీడీపీలో ఉన్న, కాంగ్రెస్ లో ఉన్న రేవంత్ రెడ్డి రేంజు అనేది వేరు. ఆ విషయం తెలంగాణ రాజకీయాల గురించి అవగాహనా ఉన్న ప్రతి ఒక్కరికి బాగా తెలుసు. ఇక తాజాగా జరిగిన సంఘటన వింటే రేవంత్ రెడ్డికి తెలంగాణ రాజకీయాల్లో ఎంతటి క్రేజ్ ఉందో ఇట్టే అర్ధం అవుతుంది.

ఆగస్టు 15 సందర్భంగా గవర్నర్ దంపతులు తేనీటి విందు ఏర్పాటు చేశారు. దీనికి రాష్ట్రములోని అన్ని పార్టీ నేతలు హాజరయ్యారు. రేవంత్ రెడ్డి వచ్చిన సమయంలో గవర్నర్ మాట్లాడుతూ ‘రేవంత్ వచ్చావా.? రాలేదేమోనని నీ కోసం ఎదురుచూస్తున్నా !’ అన్నారు. ‘మీరు ఆహ్వానించాక రాకుండా ఉంటానా..?’ అంటూ రేవంత్ బదులిచ్చాడు. ‘ఇంతకుముందు నన్ను కలవటానికి వచ్చేవాళ్ళు కదా..ఇప్పుడు రావటం లేదు ఎందుకు ..? అని గవర్నర్ అడిగిన దానికి రేవంత్ మాట్లాడుతూ ‘కొడుతారేమో’ అని రాలేదు అంటూ మాట్లాడాడు.

దీనితో గవర్నర్ మాట్లాడుతూ ‘గతంలో శాసన సభలో నేను మిమ్మల్ని కొట్టనా? మీరు నన్ను కొట్టారా ? అనే సరికి అది మనస్సులో పెట్టుకొని ఎక్కడ కొడుతారేమో అని రాలేదు ” అంటూ రేవంత్ రెడ్డి సమాధానం ఇవ్వటంతో అక్కడ ఉన్నవాళ్ళందరూ నవ్వారు . ఇలా రేవంత్ రెడ్డి గవర్నర్ మధ్య ఆసక్తికరమైన సంబాషణ జరిగింది. దీనిని బట్టి చుస్తే గవర్నర్ లాంటి వ్యక్తి రేవంత్ రెడ్డికి ఎంతటి ప్రాధాన్యత ఇస్తున్నాడో తెలుస్తుంది.