జనసేన ప్రచారంలోకి “గబ్బర్ సింగ్ అంత్యాక్షరి గ్యాంగ్”..!

Saturday, October 20th, 2018, 02:12:17 AM IST


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కేవలం రెండు ముఖ్య పార్టీల మధ్యనే పోటీ ఉంటుందనుకున్న నేపధ్యంలో ప్రముఖ సినీ నటుడు పవన్ కళ్యాణ్ “జనసేన” పేరిట ఒక పార్టీ పెట్టి మూడో ప్రత్నామ్యాయం గా మారారు.2014 లో పార్టీ పెట్టినా సరే అప్పుడు ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చెయ్యలేదు.కానీ ఈ సారి మాత్రం ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ పోటీ చేస్తానని తెలిపారు.అందుకుగాను పవన్ ఒకవైపు పార్టీ నిర్మాణం చేసుకుంటూ ప్రతీ గ్రామంలో ప్రతీ వాడలో జనసేన సభ్యత్వవాలు వారి పార్టీ యొక్క సిద్ధాంతాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని జనసేన కార్యకర్తలను అభిమానులను కోరారు.ఇప్పుడు తాజాగా గబ్బర్ సింగ్ చిత్రంలో అంత్యాక్షరి సీన్ తో “గబ్బర్ సింగ్ గ్యాంగ్” గా పేరు తెచ్చుకున్నటువంటి వారిలో కొందరు.ఈ రోజు విజయవాడలోని రామలింగేశ్వర్ నగర్ లో జనసేన పార్టీ తరపున ఇంటింటికి ప్రచారాన్ని నిర్వహించారు.వారు మాట్లాడుతూ పవన్ కోసం తమ వంతుగా జనసేన పార్టీ తరపున ప్రచారం చెయ్యడానికి వచ్చామని,ప్రతీ ఒక్కరు వారి యొక్క ఓటును మంచి కోసం ఉపయోగించుకోవాలని,పవన్ కి ఓటేస్తే ప్రజలందరికి మంచి జరుగుతుందని తెలిపారు.

  •  
  •  
  •  
  •  

Comments