తొలిసారి ఓటేసిన గద్దర్..!

Friday, December 7th, 2018, 04:00:59 PM IST

తెలంగాణ ఎన్నికల్లో ప్రజకూటమి తరఫున ప్రచారం చేసిన ప్రజాగాయకుడు గద్దర్ తోలిసారి ఓటేశారు. తన సతీమణితో కలిసి ఆల్వాల్ లోని వెంకటపారంలో ఓటేశారు గద్దర్, ఓటేయడానికి వచ్చిన గద్దర్ చేతిలో అంబెడ్కర్ ఫోటో ఉండటం విశేషం. గతంలో భువనగిరిలో బ్యాంకు ఉద్యోగిగా పని చేసే సమయంలో మావోయిస్టు పార్టీలో చేరారు గద్దర్, ఆనాటి నుండి ఆయన రాజకీయాలకు దూరంగా ఉన్నారు.

70ఏళ్ళ గద్దర్ ఇప్పటివరకు ఒకసారి కూడా ఓటేయలేదన్న విషయాన్ని తెలుసుకున్నవారు ఆశ్చర్యానికి లోనవుతున్నారు. మొదట్లో గద్దర్ తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాలనీ అనుకున్నారు, ఇందుకు రాహుల్ గాంధీ కూడా సంప్రదింపులు జరిపారు. అయితే ప్రజకూటమి సీట్ల సర్దుబాటులో కుదరకపోవడంతో గద్దర్ కు సీటు కేటాయించలేకపోయింది కాంగ్రెస్, ఆ సమయంలో ఇండిపెండెంట్ గా అయినా పోటీ చేయడానికి సన్నాహాలు చేసిన గద్దర్, తరవాత ఆ ఆలోచనను విరామంచికున్నారు. మొత్తానికి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఒక అరుదైన ఘటన చోటు చేసుకుంది.