జగన్ ఆల్రెడీ ఫిక్స్ అయ్యారు..గాజువాక వైసీపీ ఎమ్మెల్యే సంచలనం!

Friday, June 7th, 2019, 11:14:58 AM IST

ఈ రోజు వైసీపీ ఎల్పీ మీటింగు జరుగుతుండడంతో గత కొద్ది రోజుల నుంచి రాజకీయ వర్గాల్లో పెద్ద సస్పెన్స్ గా మారిన జగన్ క్యాబినెట్ వర్గం విషయం ఒక కొలిక్కి రానుండడంతో ఆయన క్యాబినెట్ లో ఎవరెవరికి మంత్రి పదవులు వస్తాయో మొత్తం 151 మంది ఎమ్మెల్యేలలో ఆ 25 మంది మంత్రులు ఎవరో ఈ రోజు ఈ మీటింగు అనంతరం తేలిపోనుంది.అయితే ఇదే మీటింగుకు సంబంధించి గాజువాకకు చెందిన ఎమ్మెల్యే తిప్పల నాగిరెడ్డి కొన్ని ఆసక్తికర కామెంట్స్ చేసారు.అలాగే ఈయన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పై గెలిచిన వ్యక్తి కావడం వలన కూడా ఈయనకు జగన్ క్యాబినెట్ లో పక్కాగా ఒక కీలక పదవి జగన్ కట్టబెడతారు అన్న టాక్ కూడా రాజకీయాల్లో ఉంది.

ఇదిలా ఉండగా ఇదే సందర్భంలోనే తిప్పల నాగిరెడ్డి జగన్ కోసం మాట్లాడుతూ జగన్ తనకి ఏ పదవి ఇచ్చినా పర్వాలేదని.అయినా మనం అనుకోకూడదు కానీ జగన్ ఈ విషయంలో ఎప్పుడో నిర్ణయం తీసేసుకున్నారని అసలు నిజం బయటపెట్టేసారు.జగన్ తన క్యాబినెట్ లో ఏ 25మంది ఉండాలో అన్నది తన మనసులో ఎప్పుడో అనుకున్నాడని దానినే ఈ రోజు అందరి సమక్షంలో తెలియజేస్తారని వ్యాఖ్యానించారు.అంటే దీన్ని బట్టి జగన్ ఎప్పుడో కసరత్తులు మొదలు మొదలు లిస్ట్ కూడా తయారు చేసేసారు అని చెప్పొచ్చు.