వీడియో టాక్‌ : గాలివాలుగా.. ఈ కుర్రాడి ప్ర‌తిభ చూశారా?

Sunday, January 21st, 2018, 09:14:52 PM IST

ప్ర‌తిభ‌ను ప్ర‌దర్శించుకునేందుకు ర‌క‌ర‌కాల మార్గాలు ఉన్నాయి. ముఖ్యంగా ఆన్‌లైన్‌, సామాజిక మాధ్య‌మాలు, యూట్యూబ్‌లో ట్యాలెంటును చూపించుకునేందుకు యువ‌త‌రానికి గొప్ప అవ‌కాశం ఉంది. ఇలా ఆన్‌లైన్ మాధ్య‌మాల్ని ఉప‌యోగించుకుని ప్ర‌తిభ నిరూపించుకుని సినిమా ఛాన్సులు కొల్ల‌గొడుతున్న ప్ర‌తిభావంతులు ఉన్నారు. అందులో కెరీర్ ప‌రంగా నిల‌దొక్కుకుని స్థిర‌ప‌డిన వారున్నారు. ఇదివ‌ర‌కూ ఆజ్ఞాత‌వాసి నుంచి `కొడ‌కా కోటేశ్వ‌ర‌రావు…` సాంగ్‌ను పోల్యాండ్‌కి చెందిన ఓ బుడ‌త‌డు ఆల‌పించ‌డం ఇదివ‌ర‌కూ చ‌ర్చ‌కొచ్చింది.

ఇప్పుడు అదే త‌ర‌హాలోనే ఈ చిత్రంలోని గాలి వాలుగా పాట‌ను ఓ కుర్రాడు ఆల‌పిస్తున్న తీరు ఆక‌ట్టుకుంటోంది. ఈ పాట వింటే స్వ‌యంగా అనిరుధ్ పిలిచి అవ‌కాశం ఇస్తాడ‌నిపించ‌క మాన‌దు. ఈ పాట పాడిన కుర్రాడి పేరు ఎడ్‌.షీర‌న్‌. ప్ర‌తిభ ఉంది. వీడియోకి ఆన్‌లైన్‌లో బోలెడ‌న్ని క్లిక్స్ వ‌స్తున్నాయి. ఒక‌వేళ సంగీత ద‌ర్శ‌కుల‌కు న‌చ్చితే పిలిచి అవ‌కాశం ఇస్తారేమో?