ఎన్ఆర్ఐలతోనే అభివృద్ది సాధ్యం

Monday, September 15th, 2014, 06:26:26 PM IST


ఆంధ్రప్రదేశ్ అబివృదిలో ఎన్ఆర్ఐ లు భాగస్వామ్యం కావాలని, ఎన్ఆర్ఐల సహాకారంతోనే రాష్ట్రం అభివృద్దిచెందుతుందని తెలుగుదేశం పార్టీ నేత, మాజీ మంత్రి గల్లా అరుణ కుమారీ అమెరికాలోని శాంతాక్లారాలో అన్నారు. రానున్న ఐదేళ్ళలో రాష్ట్రం అభివృద్ది చెందుతుందని.. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు పరిశ్రమలు నెలకొల్పేందుకు సరలీకృత విధానాలు అవలంభిస్తున్నారని.. ఈ తరుణంలో ఎన్ఆర్ఐ ల సహాకారం ఎంతో అవసరమని గల్లా అరుణకుమారి అన్నారు.

శాంతాక్లారాలో ఎన్ఆర్ఐ లు అరుణకుమారికి సన్మానం చేశారు. ఈ సందర్భంగా ఆమె ఎన్ఆర్ఐలను గురించి మాట్లాడారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇదే మంచి సమయమని ఆమె అన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజన్ తో పనిచేస్తున్నారని, ప్రస్తుతం రాష్ట్రం క్లిష్ట పరిస్థితులలో ఉందని, కాని వచ్చె ఐదు సంవత్సరాలలో దేశంలో అగ్రగామి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరిస్తుందని ఆమె తెలియజేశారు.