కరోనా పై మరొక ముందడుగు – ప్లాస్మా థెరపీ లో చరిత్ర సృష్టించిన గాంధీ ఆసుపత్రి…

Friday, May 22nd, 2020, 12:58:27 PM IST

గత కొంత కాలంగా మన దేశంలో మహమ్మారి కరోనా వైరస్ తీవ్రత రోజురోజుకు చాలా దారుణంగా పెరిగిపోతుంది. కాగా ఈ వైరస్ ని నివారించడానికి మన ప్రభుత్వాలు ఎన్నో కఠినమైన నిర్ణయాలు తీసుకున్నాయి. కాగా ఈ వైరస్ ని అరికట్టడానికి మన శాస్త్రవేత్తలు, వైద్యబృందం అహో రాత్రులు శ్రమిస్తూ, కఠినమైన చర్యలను చేపడుతున్నారు. కాగా ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్రంలోని గాంధీ ఆసుపత్రిలో ప్రారంభించినటువంటి ప్లాస్మా థెరపీ విజయవంతమైన ఫలితాలను ఇస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. కాగా ప్లాస్మా థెరపీలో గాంధీ ఆస్పత్రి నయా చరిత్ర సృష్టించింది. కరోనా పాజిటివ్‌ రోగికి ప్లాస్మా థెరపీ చేసి విజయం సాధించారు గాంధీ వైద్యులు.

కాగా స్థానికంగా ఉన్నటువంటి ఒక 44 ఏళ్ల వ్యక్తికి వారం క్రితం ప్లాస్మా థెరపీ చేయగా ఆయన ఇప్పుడు పూర్తిగా కోలుకున్నాడని, మరొక రెండు మూడు రోజుల్లో ఆసుపత్రి నుండి డీఛార్జ్ అవనున్నాడని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. అయితే ఆ వ్యక్తి కరోనా కారణంగా బాధపడుతున్న తరుణంలో, అతడిపై గాంధీ ఆసుపత్రి వైద్యులు ప్లాస్మా థెరపీని ప్రవేశపెట్టారు. అది కాస్త విజయవంతం అవడంతో, మరొక నలుగురిపై కూడా ఈ ప్లాస్మా థెరపీని ప్రవేశపెట్టారు.