గంటా శ్రీనివాస‌రావు : జగన్ అలా మాట్లాడడం ముమ్మాటికి తప్పే

Sunday, June 2nd, 2019, 12:43:36 AM IST

ఏపీలో ఈ దఫా జరిగిన ఎన్నికలలో వైసీపీ విజయం సాధించి రెండు రోజుల క్రితమే జగన్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. అయితే జగన్‌కు శుభాకాంక్షలు తెలిపేందుకు గాను రెండు రోజులు ట్రై చేసిన ఆ అవకాశం దక్కలేదన్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన జగన్‌మోహన్‌రెడ్డి ద‌గ్గ‌ర‌కు స్వ‌యంగా వెళ్లి టీడీపీ తరఫున శుభాకాంక్షలు తెలిపేందుకుగాను తనతో పాటు ఎమ్మెల్యేలు పయ్యావుల కేశవ్‌, అచ్చెన్నాయుడును పార్టీ అధిష్టానం నియమించింది. అయితే జగన్ మాకు ఆవకాశం ఇవ్వలేదని గంటా తెలిపారు.

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న గంటా నిన్న విలేఖరులతో మాట్లాడుతూ అధికార దాహంతో ఉన్న జగన్‌కు ఒక్కసారిగా అధికారం వచ్చేసరికి ఏం మాట్లాడుతున్నాడో కూడా ఆయనకే అర్ధం కావడంలేదని, ప్రమాణ స్వీకారం సందర్భంగా జగన్‌ చేసిన వ్యాఖ్యలు సమంజసంగా లేవని గంటా ఆన్నారు. అయితే జగన్ ప్రమాణ స్వీకారం రోజున మీడియాను బెదిరిస్తున్నట్టుగా జగన్ మాట్లాడరని తన మీడియాలో కూడా చంద్రబాబుపై లేని పోని వార్తలు సృష్టించి రాసేవారని అయినా ఏనాడు చంద్రబాబు మీడియాను బెదిరించలేదని ఆయన అన్నారు. ప్రతిపక్షం అవినీతికి పాల్పడిందని అనడం సరికాదని అది ఆధారాలతో ప్రూవ్ చేసినప్పుడు మాట్లాడాలే తప్పా ఏది పడితే అది మాట్లాడడం మంచిది కాదని గంటా అన్నారు. ఎన్నికల వేళ నవరత్నాల పేరిట ఇచ్చిన హామీలను అప్పుడే తప్పుదోవ పట్టిస్తున్నారని టెండర్ల రద్ధు విషయం కూడా తన వాళ్లకు ఇచ్చే ఆలోచనలో భాగమే తప్పా వేరే అర్ధమేమి లేదని ఆయన అన్నారు.