పొలిటికల్ బ్లాస్ట్ : చంద్రబాబుకు భారీ దెబ్బ కొట్టి వెళ్లిపోనున్న గంటా..!?

Saturday, November 9th, 2019, 06:22:11 PM IST

2014లో జరిగినటువంటి ఎన్నికల్లో “సైకిల్” జోరు దగ్గర జగన్ “ఫ్యాన్” గాలి నిలవలేకపోయింది.కానీ 2019 ఎన్నికల్లో మాత్రం ఫ్యాన్ గాలికి సైకిల్ షేపులు ఊహించని రీతిలో మారిపోయాయి.కేవలం 23 మంది ఎమ్మెల్యేలను మాత్రమే కట్టబెట్టి జగన్ భారీ షాక్ ఇచ్చారు.ఇపుడు ఆ సంఖ్య 22 రెండుకి చేరుకుంది అది వేరే విషయం అనుకోండి.ఇలా ఫలితాలు వచ్చిన దగ్గర నుంచి కూడా తెలుగుదేశం పార్టీ అనే మహా కోటను నెలకొరగకుండా కాపాడుకోడానికి చంద్రబాబు తన సర్వ శక్తులు ఒడ్డుతున్నారు.

కానీ అధికారంలో లేని చంద్రబాబుతోనే చివరి వరకు ఉంటే తమ భవిష్యత్తు ఏమిటని ఆలోచించి వారి దారులు వారు చూసుకుంటున్నారు.అయితే అదే పార్టీకు చెందిన కీలక నేతలు అయినటువంటి వారిలో గంటా శ్రీనివాస్ కూడా ఒకరు.అలాంటి గంటా ఇప్పుడు తెలుగుదేశం పార్టీకు మరియు చంద్రబాబు కోలుకోలేని దెబ్బ కొట్టి వెళ్ళిపోతున్నట్టు రాజకీయ వర్గాల్లో కొన్ని వార్తలు సంచలనం రేపుతున్నాయి.గత కొన్నాళ్ల నుంచి అధికారంలో లేని పార్టీ లో ఉండబోరని అందుకే వైసీపీలోకి వెళ్లిపోతున్నారని వార్తలు ఏపీ పాలిటిక్స్ ను హీటెక్కించాయి.

కానీ ఇప్పుడు మాత్రం గంటా బీజేపీలో చేరిపోతున్నారు అన్న వార్తలు ఊపందుకున్నాయి.అదుగో..చేరిపోతున్నారు అన్న రేంజ్ లో వినిపిస్తున్నాయి కూడా.ఇదిలా ఉండగా గంటా వెళ్లిపోడమే బాబుకు పెద్ద దెబ్బ అనుకుంటే ఆయన ఇపుడు వెళ్తూ వెళ్తూ తన వెంట మరో తొమ్మిది మంది ఎమ్మెల్యేలను కూడా తీసుకెళ్ళిపోతున్నారని సమాచారం.ఒకవేళ ఇదే కానీ నిజమైతే ఇక టీడీపీ మళ్ళీ తిరిగి లేవలేని దెబ్బ తిన్నట్టే అని చెప్పాలి.మరి రానున్న రోజుల్లో ఏం జరుగుతుందో చూడాలి.