బిగ్ బ్రేకింగ్ : మంత్రి పదవి లేకుండా నేనుండలేను

Monday, June 17th, 2019, 08:55:27 AM IST

ప్రతిసారి ఎన్నికల సమయంలో కొత్త నియోజకవర్గంలో పోటీచేసి గెలవటం, ప్రతిసారి పార్టీ మరి మంత్రి పదవి సొంతం చేసుకోవటంలో సిద్ధహస్తుడు గంటా శ్రీనివాసరావు. ఎవరేమి అనుకున్న కానీ, వాటిని అసలు ఖాతరు చేయకుండా అధికారం కోసం పార్టీ జెండాలు మారుస్తూవుంటాడు. కానీ ఈ సారి మాత్రం ఛాన్స్ లేకుండాపోతుంది. టీడీపీ పార్టీ అధికారం కోల్పోయింది. జగన్ సీఎం అయ్యాడు. సరే వైసీపీ లోకి పోదామంటే జగన్ నో ఎంట్రీ బోర్డ్ పెట్టాడు. ఒక వేళా వెళ్లిన కానీ ఇప్పటికే మంత్రి పదవులు రాక కొందరు నాయకులు దీర్ఘాలు తీస్తున్నారు. ఇక గంటా పొతే మంత్రి పదవి కాదు కదా..కనీసం ప్రభుత్వ సంస్థల చైర్మన్ పదవి కూడా దక్కదు. ఆలా అని చెప్పి, అధికారం లేకుండా ,ఐదేళ్లు ప్రతిపక్షంలో కూర్చోవటం గంటా కి కష్టం. దీనితో ఎదో ఒకటి అధికార పార్టీ వైపు వెళ్లాలని చూస్తున్నాడు.

రాష్ట్రంలో వైసీపీ లోకి పోవటం కష్టం. ఇక మిగిలింది కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ. కనీసం దానిలోని వెళ్ళినకాని, కేంద్రంలో అధికారంలో ఉంది కాబట్టి, రాష్ట్రంలో ఏమైనా పనులు చెప్పించుకోవానే ఆలోచనలో గంటా ఉన్నాడు. ఇలా బీజేపీ లోకి వెళ్లాలనే తన ఆలోచనని సన్నిహితుల దగ్గర చెపుతూ, ఐదేళ్లు ఎలాంటి అధికారం లేకుండా ఉండటం చాలా కష్టం. ఆ తర్వాత కూడా అధికారంలోకి వస్తామనే నమ్మకం లేదు. కాబట్టి ప్రస్తుత పరిస్థితులో బీజేపీ లోకి వెళ్లిపోవటమే మన ముందు ఉన్న ఏకైక మార్గం అంటూ చెప్పినట్లు తెలుస్తుంది. అయితే దీనిపై గంటా వర్గంలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అయినట్లు తెలుస్తుంది. మరి కొద్దీ రోజుల్లో పార్టీ మారే విషయంపై ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.