షాకింగ్ : జగన్ పై గంటా సంచలనం రేపే మాటలు..!?

Sunday, June 9th, 2019, 04:50:59 PM IST

ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధినేత వై ఎస్ జగన్ ఇతర పార్టీలు విస్తుపోయేలా మైండ్ బ్లాకింగ్ విజయాన్ని తన కైవసం చేసుకున్నారు.పోటీ చేసిన 175 నియోజకవర్గాలలోను ఏకంగా 151 స్థానాల్లో గెలుపొంది తిరుగులేని సామ్రాజ్యాన్ని ఏర్పరచుకున్నారు.ఆ ఫలితాల పూర్తవ్వక ముందే జగన్ గెలుపు ఖాయమని అంతా అనుకునే సందర్భంలోనే జగన్ తన ప్రమాణ స్వీకారం కోసం దేశ వ్యాప్తంగా ఉన్న కీలక రాజకీయ నాయకులను అందరినీ కలిసి తన ప్రమాణ స్వీకారానికి ఆహ్వానించారు.అందులో భాగంగానే జగన్ మాజీ ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబుకు కూడా స్వయంగా ఫోన్ చేసి మరీ ఆహ్వానించారు.

కానీ చంద్రబాబు అక్కడకి వెళ్లకుండా ఆ పార్టీకి చెందిన కీలక నేతలు అయినటువంటి గంటా శ్రీనివాసరావు మరియు అచ్చెన్నాయుడులను వెళ్ళమని చెప్పగా వారు కూడా వెళ్లిన దాఖలాలు లేకపోగా ఫోన్ కాల్ లో శుభాకాంక్షలు తెలిపేందుకు గంటా ప్రయత్నించగా జగన్ అందుకు నిరాకరించిన సంగతి కూడా తెలిసిందే.అయితే ఈ అంశాలకు సంబంధించి గంటా జగన్ పై కొన్ని సంచలన కామెంట్స్ చేసినట్టు ఇప్పుడు తెలుస్తుంది.జగన్ తన ప్రమాణ స్వీకారం చేసిన రోజున టీడీపీని విమర్శిస్తూ చేసిన మాటలు సమంజసం కాదని తప్పుబట్టారు.

అలాగే టెండర్ల రద్దు పేరిట జగన్ గత ప్రభుత్వం పై కక్ష తీసుసుకునే విధంగా ప్రయత్నం చేస్తున్నారని మండి పడ్డారు.అలాగే దేశ ప్రధాని నరేంద్ర మోడీని కలిసిన తర్వాత ప్రత్యేకహోదా విషయంలో జగన్ చేతులెత్తేశారని మండిపడ్డారట.చివరిగా వృద్ధులకు మూడు వేల రూపాయల పింఛనును అందజేస్తానని చెప్పిన జగన్ మాట మార్చి కేవలం 2000 కు ఒక 250 మాత్రమే పెంచి దశలు వారీగా 3000 కు పెంచుతానని మోసం చేసారని సంచలన కామెంట్స్ చేసినట్టు తెలుస్తుంది.ఈ మాటలన్నీ గంటా నిజంగా అన్నారో లేదో కానీ ఇప్పుడైతే రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి.