బిగ్ బ్రేకింగ్ : వైసీపీ విషయంలో గంటా సంచలన నిర్ణయం..!?

Thursday, October 10th, 2019, 04:34:40 PM IST

ఇప్పుడు ఏపీ అధికార పార్టీ అయినటువంటి వైసీపీలో పరిణామాలు చాలా త్వర త్వరగా మారిపోతున్నాయి.తాజాగా వైసీపీలో జగన్ సమక్షంలో జూపూడి చేరికతో ఇప్పుడు అంతా అల్లకల్లోలంగా ఉంది.సరిగ్గా స్థానిక ఎన్నికల సమరం దగ్గర ఉంటుండే సరికి వైసీపీలోకి వలసల ఊపు పెరుగుతుంది.ఇదిలా ఉండగా ఎప్పటి నుంచో వైసీపీలోకి చేరుతారు అని వినిపిస్తున్న పేరులలో గంటా శ్రీనివాసరావు కూడా ఒకటి.

టీడీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందిన గంటా వ్యవహారం ఎపుడు చర్చకు వచ్చినా అది హాట్ టాపిక్ గా మారుతూనే ఉంటుంది.అయితే గంటా మాత్రం ఇపుడు తన రాజకీయాల విషయంలో ఒక సంచలన నిర్ణయం టీయూస్కున్నట్టు తెలుస్తుంది.గంటా ఇప్పటికే మూడు సార్లు వైసీపీ నేతలతో చర్చలు నడిపారని కానీ జగన్ చెప్పిన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చెయ్యాలనే అంశం దగ్గర సంశయించారని రాజకీయ వర్గాలు అంటున్నాయి.

అలాగే గంటాపై వైసీపీ అభిమానుల్లో చాలా వ్యతిరేఖత ఉంది,దానికి తోడు ఇప్పుడు జూపూడి లాంటి వ్యక్తులు చేరడంతో పరిస్థితులు మరింత ఆందోళనాకారంగా మారిపోయాయి.దీనితో ఇప్పుడున్న పరిస్థితుల్లో తాను కానీ చేరినట్టయితే ఇంకెలా పరిస్థితులు నెలకొంటాయో అన్న కోణం కూడా ఇప్పుడు కనిపిస్తుంది.దీనితో గంటా వైసీపీలో చేరకుండా ఉంటేనే బెటర్ అనే అభిప్రాయానికి వచ్చేందుకు అవకాశాలు కూడా లేకపోలేవని మరోవైపు వినిపిస్తుంది.మరి మొత్తంగా ఇప్పట్లో అయితే గంటా వైసీపీలో చేరే అవకాశాలు లేనట్టే అని చెప్పాలి.