అప్పట్లో కేసీఆర్..ఇప్పుడు గరికపాటి..టీడీపీ ఖేల్ ఖతం

Saturday, August 17th, 2019, 09:15:27 AM IST

తెలంగాణలో ఇప్పటికే తెలుగుదేశం పార్టీ దాదాపుగా దుకాణం మూసేసుకునే పరిస్థితిలో ఉంది. 2014 ఎన్నికల తర్వాత టీడీపీ దారుణమైన ఇబ్బంది ఎదుర్కొంది. అ పార్టీ నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలోకి లాక్కొని టీడీపీని ఖాళీ చేసే బాధ్యతని తీసుకోని దాదాపుగా సక్సెస్ అయ్యాడు. అ తర్వాత మిగిలిన నేతలు తలో ఒక పార్టీలో చేరిపోయారు. అయితే ద్వితీయ శ్రేణి నేతలు మాత్రం ఎటు పోలేక టీడీపీ నీడలోనే కాలం వెళ్లదీస్తున్నారు.

ఇలాంటి తరుణంలో మిగిలిన టీడీపీ పార్టీ క్యాడర్ ని పూర్తిగా ఖాళీ చేపించే పనిని గరికపాటి తీసుకున్నాడు. టీడీపీ నుండి బీజేపీలోకి వెళ్లిన అయిన తనతో పాటుగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మిగిలి ఉన్న టీడీపీ నేతలను బీజేపీలోకి తీసుకొనివెళ్తున్నాడు. అన్ని జిల్లాల నుండి మండల స్థాయి నేతల జిల్లా స్థాయి నేతలతో స్వయంగా గరికపాటి మాట్లాడి వాళ్ళకి రాజకీయ హామీలు ఇచ్చి, ఈ నెల 18న జరగబోయే బీజేపీ భారీ బహిరంగ సభలో తనతో పాటుగా వాళ్ళకి బీజేపీ తీర్థం పోయిస్తున్నాడు.

నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రాండ్ లో జరిగే ఈ సమావేశానికి అన్ని తానై వ్యవహరిస్తున్నాడు గరికపాటి. ఇందుకోసం అయ్యే ఖర్చు మొత్తం ఒక్కడే భరిస్తున్నాడు. జెపి నడ్డా ఆధ్వర్యంలో తెలంగాణలో తన సత్తా ఏమిటో చూపించుకోవాలని గరికపాటి చూస్తున్నాడు. గత నాలుగు రోజుల నుండి ఈ సభకి అవసరమైన పనులన్నీ తానే దగ్గరగా ఉంది చూసుకుంటున్నాడు. అలాగే రాష్ట్ర నుండి బీజేపీ శ్రేణులను సభకి తరలించే బాధ్యత కూడా గరికపాటి తీసుకోని ఇప్పటికే అన్ని సిద్ధం చేసుకున్నాడు.