ట్రైలర్ టాక్ : పీఎస్ వి గరుడ వేగ..ఈ మిషన్ చాలా ఇంటరెస్టింగ్ !

Wednesday, October 18th, 2017, 01:15:23 AM IST

చాలా కాలం గ్యాప్ తరువాత రాజశేఖర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘పీఎస్ వి గరుడ వేగ’. ఈ చిత్ర ట్రైలర్ ని స్టార్ హీరో బాలకృష్ణ విడుదల చేసారు. ఈ చిత్రంలో రాజశేఖర్ అండర్ కవర్ ఆఫీసర్ గా కనిపించబోతున్నాడు. ట్రైలర్ లోని విజువల్స్ చూస్తుంటే హాలీవుడ్ ప్రమాణాలతో ఈ చిత్రాన్ని రూపొందించినట్లు స్పష్టం అవుతోంది. పూజా కుమార్, శ్రద్దా కపూర్ లు కథానాయికలు గా నటిస్తున్నారు.

‘వాళ్ళ కమ్యూనికేషన్ సిస్టం హైటెక్ గా ఉంది. లేటెస్ట్ టెక్నాలజీ వెపన్స్ వాడుతున్నారు. ఏదో జరగబోతోంది. వి నీడ్ టు ట్రాక్ ఇట్ యాజ్ సూన్ యాజ్ పాజిబుల్’ సర్ అంటూ రాజశేఖర్ చెబుతున్న డైలాగులు సినిమాపై అంచనాలు పెంచేవిగా ఉన్నాయి. ఇందులూ రాజశేఖర్ చేపడుతున్న ఆపరేషన్ ఏంటి.. స్మగ్లింగ్ నేపథ్యం లో ఈ చిత్రం సాగుతుందా అనే అంశాలు సినిమా చూసే తెలుసుకోవాలి. ట్రైలర్ చూపిన విధంగా ప్రతి సన్నివేశాన్ని రిచ్ గా చిత్రీకరించినట్లు తెలుస్తోంది. సినిమా పై ఆసక్తిని పెంచే విధంగా ఈ ట్రైలర్ ఉందనడం లో సందేహం లేదు. కాగా ఈ చిత్రంలో శృంగార తార సన్నీలియోన్ కూడా ప్రత్యేక గీతంలో మెరిసింది.

  •  
  •  
  •  
  •  

Comments