ఆడియోని పొలిటిక‌ల్ మీటింగుని చేశారు!

Tuesday, December 27th, 2016, 12:25:36 AM IST

chandrababu
గౌత‌మిపుత్ర శాత‌క‌ర్ణి ఆడియో తిరుప‌తి నుంచి లైవ్ అవుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ లైవ్ ఆద్యంతం పొలిటిక‌ల్ ప్రెస్‌మీట్‌లా రాజ‌కీయాల్ని ఎత్తుకొచ్చాయి. ముఖ్యంగా సీఎం చంద్ర‌బాబు అమ‌రావతిని, తెలుగువారిని పొగిడేస్తూ బోలెడ‌న్ని ఛాలెంజ్‌లు విసిరారు.

బాబు మాట్లాడుతూ -“తెలుగు జాతి ఉన్నంత‌కాలం గుర్తండే వ్య‌క్తి నంద‌మూరి తార‌క‌రామారావు. సినిమాల్లోనే కాదు.. రాజ‌కీయాల్లోనూ మార్పులెన్నో తెచ్చారు. కాంగ్రెస్‌ని త‌రిమి నాన్ కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని ఏర్పాటు చేశారు. నేష‌న‌ల్ ఫ్రంట్ ని ఏర్పాటు చేసి ప్ర‌ధానుల్ని త‌యారు చేసిన‌ది నంద‌మూరి తార‌క‌రామారావు. ఏసుప్ర‌భువు పుట్టిన త‌ర్వాత క్రీస్తు శ‌కం మొద‌లైంది. క్రీ.పూ, క్రీ.శ .. తెలుసు. క్రీ.శ‌కం త‌ర్వాత 70 ఏళ్ల‌కు శాలివాహ‌న రాజ్యం మొద‌లైంది“ అని చెప్పారు.

“ఈ సినిమాని మించి రాజ‌ధాని క‌ట్టాల్సిన బాధ్య‌త నాపై ఉంది. ఏదో రాజ‌ధాని అంటే అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్ కాదు. భార‌త‌దేశంలోనే అమ‌రావ‌తి నంబ‌ర్ 1గా ఉండాలి. ప్ర‌పంచ‌దేశాల్లో అమ‌రావ‌తి ఒకానొక గొప్ప న‌గ‌రంగా తీర్చిదిద్దుతాం. చేసి తీరుతాం.. ఈ సంద‌ర్భంలో ఈ సినిమాని బాల‌కృష్ణ తీసుకురావ‌డం సంతోషించ‌ద‌గ్గ‌ది. భార‌త‌దేశంలో నంబ‌ర్‌1గా ఏది ఉండాలి? అంటే ఆంధ్ర‌ప్ర‌దేశ్ ఉండాలి.“. అన్నారు. ఒక ఆడియో వేడుక‌లో మ‌రీ ఇంత పొలిటిక‌ల్ సుత్తి అవ‌స‌ర‌మా? అంటూ ప‌లువురు ప్ర‌శ్నించారు మ‌రి.

  •  
  •  
  •  
  •  

Comments