శాతకర్ణి … పాటల వేడుక ఖరారైంది?

Thursday, November 24th, 2016, 11:54:35 AM IST

gauthami-putra-shatakarni
నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న వందో సినిమా ‘గౌతమి పుత్ర శాతకర్ణి’. అత్యంత భారీ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. క్రిష్ దర్శకత్వంలో రూపొందుతున్నఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేయడానికి జోరుగా సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమా పాటలను వచ్చే నెల 16 న విడుదల చేస్తారట, ఈ వేడుకను తిరుపతిలో జరుపుతున్నట్టు తెలిసింది. ఈ ఆడియో వేడుకతో సహా సినిమాకు సంబందించిన అన్ని కార్యక్రమాలు భారీగా ప్లాన్ చేస్తున్నారు. మరో వైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు జోరుగా జరుగుతున్నాయి, శ్రియ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటి హేమమాలిని కీలకపాత్రలో నటిస్తుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న చిత్రాన్ని విడుదల చేస్తారట !! ఇప్పటికే బిజినెస్ పరంగా సంచలనం రేపిన శాతకర్ణి చిత్రం బాలయ్య కెరీర్ లో ప్రత్యేకంగా నిలవనుంది.