శాతకర్ణి క్లైమాక్స్ కి ఏమైంది?

Sunday, February 12th, 2017, 12:29:32 PM IST


గౌతమీ పుత్ర శాతకర్ణి సినిమా విడుదల అయ్యి సూపర్ కలక్షన్ లు సాధించి థియేటర్ లలోంచి వెళ్ళిపోయాక ఇప్పుడు క్లైమాక్స్ గురించి అడుగుతారు ఏంటి అంటున్నార ? అదే చెప్తున్నా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ విషయం లో పెర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే సంక్రాంతి కి విడుదల అయిన మిగిలిన రెండు సినిమాలూ అంటే ఖైదీ , శతమానం భవతి కలక్షన్ ల వసూళ్ళ గురించి ట్రేడ్ వర్గాలు అప్డేట్ లు చేసాయి కానీ ఈ సినిమా గురించి మాత్రం ఎక్కడా లెక్కలే లేవు. ట్రేడ్ నుంచి కూడా ఒక దశ దాటాక ఈ సినిమా కలెక్షన్లపై అప్ డేట్స్ ఆగిపోయాయి. మూడో వీకెండ్ వరకు వివరాలు బయటికి వచ్చాయి కానీ.. ఆ తర్వాత సమాచారం లేదు. చివరగా బయటికొచ్చిన లెక్కల ప్రకారం అప్పటికి ఆ సినిమా రూ.48 కోట్ల దాకా వరల్డ్ వైడ్ షేర్ కలెక్ట్ చేసి.. బ్రేక్ ఈవెన్ (రూ.50 కోట్లు)కు చేరువగా వచ్చింది