బాలయ్య శాతకర్ణి .. వల్ల లాభమా నష్టమా ?

Monday, February 13th, 2017, 08:05:01 PM IST


నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన వందో సినిమా ”గౌతమీపుత్ర శాతకర్ణి”. ఈ సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాతో బాలయ్య మరో కొత్త క్రేజ్ క్రియేట్ చేసుకున్నాడు. అఖండ భారతాన్ని పాలించిన గౌతమీపుత్ర శాతకర్ణి కథతో సినిమా తెరకెక్కించి గొప్ప ప్రయత్నమే చేసారు. ఇక ఈ సినిమా మొత్తంగా 52 కోట్ల వసూళ్లు రాబట్టి, బాలయ్యను యాభై కోట్ల క్లబ్ హీరోగా నిలబెట్టింది? ఈ సినిమాకు అటు ఆంధ్రా .. ఇటు తెలంగాణ ప్రభుత్వాలు పన్ను రాయితీని అందించాయి. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమాను కూడా భారీ బడ్జెట్ తో తెరకెక్కించారు. దాదాపు యాభై కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా ఫైనల్ గా 52 . 75కోట్ల వసూళ్లు మాత్రమే రాబట్టింది .. అంటే శాతకర్ణి సినిమాతో నిర్మాతలకు లాభమా నష్టమా అనేది వారే చెప్పాలి!! బాలయ్య వందో చిత్రం కావడంతో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కించిన ఈ సినిమా అనుకున్న స్థాయిలో వసూళ్లను మాత్రం రాబట్టలేకపోయింది అనేది ఫిలిం వర్గాల టాక్? ఈ చిత్రం ఓవర్ సీస్ లో భారీ వసూళ్లు సాధించి బాలయ్య సత్తా చాటింది. అక్కడ ఏకంగా 2 మిలియన్స్ మార్క్ దాటడం విశేషం!! మరి గౌతమి పుత్ర శాతకర్ణి సినిమా ఫైనల్ వసూళ్లు ఎలా ఉన్నాయో చూద్దామా .. (షేర్ లలో )
నైజాం – 10 . 15 కోట్లు,
సీడెడ్ – 8. 01 కోట్లు,
ఉత్తరాంధ్రా – 5. 02 కోట్లు,
గుంటూరు – 4. 02 కోట్లు,
కృష్ణా – 3. 15 కోట్లు,
ఈస్ట్ – 3. 05 కోట్లు,
వెస్ట్ – 3. 06 కోట్లు,
నెల్లూరు – 1. 08 కోట్లు,
కర్ణాటక – 4. 25 కోట్లు,
రెస్ట్ అఫ్ ఇండియా – 1. 00 కోట్లు,
అమెరికా – 7. 02 కోట్లు,
రెస్ట్ అఫ్ వరల్డ్ – 1. 00 కోట్లు, శాతకర్ణి వసూళ్లు ప్రపంచ వ్యాప్తంగా మొత్తంగా కలిపి 52. 75 కోట్లు.