కోహ్లీ ను కెప్టెన్ గా కొనసాగించవద్దు – గౌతం గంభీర్

Sunday, November 8th, 2020, 02:14:54 AM IST

ఎప్పటికైనా కోహ్లీ నేతృత్వం లో ఐపియల్ కప్ కొట్టాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అయితే ఈ సారి కూడా కోహ్లీ ప్లే ఆఫ్ కి చేరుకొని మరి సన్ రైజర్స్ హైదరాబాద్ చేతిలో ఓటమి చవి చూశారు. అయితే రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఓటమితో కోహ్లీ పై అతు నెటిజన్ల నుండి, ఇటు సీనియర్ ఆటగాళ్ళ నుండి వరుస విమర్శలు ఎదురు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో గౌతం గంభీర్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. అవి కాస్త సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

ఐపియల్ సీజన్ 13 లో కూడా ఆర్సిబీ ఓటమి పాలు కావడం తో జట్టు కెప్టెన్సీ నుండి విరాట్ కోహ్లీ ను తొలగించాలి అని గంభీర్ అన్నారు. కోహ్లీ ను కెప్టెన్ గా కొనసాగించవద్దు అని యాజమాన్యం కి సూచించారు. ఒక్కసారి కూడా విజయం సాధించకుండా ఎనిమిదేళ్లు కొనసాగడం చాలా ఎక్కువ అని, రవి చంద్రన్ అశ్విన్ ను చూడండి, పంజాబ్ కి రెండేళ్లు కెప్టెన్ గా ఉన్నాడు, ఫలితం లేకపోవడం తో తప్పించారు అంటూ గుర్తు చేశారు. అయితే రోహిత్, ధోనీ ల గురించి ఎలా అయితే మాట్లాడతామో, కోహ్లీ కూడా అంతే అంటూ గంభీర్ చెప్పుకొచ్చారు. అయితే రోహిత్ ముంబై లో నాలుగు సార్లు, ధోనీ చెన్నై కి మూడు సార్లు టైటిల్స్ అందించారు అని గుర్తు చేశారు. అందుకే వారిని ఇన్నేళ్ళు కొనసాగించారు అని, ఒకవేళ రోహిత్ 8 ఏళ్లు అలా రాణించక పోయి ఉంటే తొలగించే వారు అని చెప్పుకొచ్చారు.

ఒక్కొక్కరికి ఒక్కో లెక్క ఉండకూడదు అని, ఏ సమస్య అయినా, బాధ్యత అయినా కెప్టెన్ నుండే మొదలు అవ్వాలి అని అది జట్టు యాజమాన్యం మరియు సిబ్బంది నుండి కాదు అను గంభీర్ తెలిపారు. కెప్టెన్ గా గెలిచినప్పుడు క్రెడిట్ ఎలా అయితే దక్కుతుందొ, ఓటమిపాలు అయినప్పుడు కూడా విమర్శలు ఎదుర్కోవాలి అంటూ గంభీర్ చెప్పుకొచ్చారు.