రాజమౌళి కి ఉన్నంత సీన్ , ధైర్యం నాకు లేవు – గౌతం మీనన్ సంచలన వ్యాఖ్యలు

Thursday, November 24th, 2016, 12:11:41 PM IST

goutham-menon
సౌత్ ఇండియా లో మణిరత్నం తరవాత ఆ ఫీల్ తో సినిమా తీయగలడు అని గౌతం మీనన్ కి మంచి పేరు ఉంది. ఏం మాయ చేసావే రోజుల నుంచీ లవ్ స్టోరీ అంటే గౌతం దే చూడాలి అనే రీతిలో ఆయన టేకింగ్ ఉంటుంది. కెరీర్ మొదటి నుంచీ క్లాసిక్స్ ని తీస్తున్న ఈ డైరెక్టర్ రాజమౌళి ని తెహ్గా పొగిడేస్తున్నాడు. మన రాజమౌళి తరహాలో సినిమాలు తీయడం తన వల్ల కాదు అంటున్నాడు. రాజమౌళితో పోలిస్తే తన శైలి పూర్తి భిన్నమని అతనన్నాడు. ‘బాహుబలి’ తరహా భారీ సినిమాలు మీరు తీయరా అన్న ప్రశ్నకు సమాధానంగా ఈ విధంగా బదులిచ్చాడు గౌతమ్. ” నేను ఎలాంటి సినిమా తీయాలి అన్నా రియల్ గా ఉందా లేదా అనేది చూసుకుంటాను. ప్రేమ కథ కానీ యాక్షన్ కథ కానీ దాదాపు అన్నీ రియల్ సంఘటనలే ఉంటాయి. రాజమౌళి గారి లాగా ఫాంటసీ తీయడం నా వల్ల కాదు నాకంత సీన్ లేదు , ధైర్యం లేదు ” అన్నాడు ఈయన. “ఐతే నేను ఒకే శైలిలో వెళ్లిపోతున్నానేమో.. ఈ మొనాటనీని బ్రేక్ చేయాలేమో అనిపిస్తుంది. భవిష్యత్తులో శైలి మార్చుకుని వేరే తరహా సినిమాలు చేస్తానో ఏమో నాకు తెలియదు’’ అని గౌతమ్ అన్నాడు.