గౌతమీ పుత్ర శాతకర్ణి లో హై లైట్స్ ఇవే :

Friday, December 30th, 2016, 11:36:22 AM IST

gouthamiputhra-sathakarni
కేవలం ఒకే ఒక్క ట్రైలర్ తో గౌతమీ పుత్ర శాతకర్ణి మీద అందరికీ అంచనాలు పెరిగిపోయాయి. గౌతామీ పుత్ర శాతకర్ణి షూటింగ్ మొదలు పెట్టిన మొదట్లో ఈ సినిమాని గురించి పెద్దగా ఆలోచించలేదు ఎవ్వరూ. ఆడియో వేడుకలో క్రిష్ ఇచ్చిన హాట్ హాట్ స్పీచ్ కి అందరూ ఇటువైపు చూడడం మొదలు పెట్టారు. దానికి తోడు ట్రైలర్ అద్భుతంగా కట్ అవ్వడం తో ఇక శాతకర్ణి కి తిరుగులేని హైప్ ఏర్పడింది. ఈ సినిమా ఇంకా సెన్సార్ కి వెళ్ళాల్సి ఉండగా ఆడియో కూడా పాజిటివ్ గానే నడుస్తోంది. ఈ సినిమాలో ఏయే సన్నివేశాలు హై లైట్ అయ్యాయి అనే కోణం లో ఆలోచిస్తే ఈ మధ్యనే ఒక ఇంటర్వ్యూ లో నారా రోహిత్ ఈ విశేషాల గురించి చెప్పాడు. ‘‘2017లో మోస్ట్ అవైటెడ్ మూవీ అంటే ‘గౌతమీపుత్ర శాతకర్ణి’నే. అదృష్టం కొద్దీ నేను ఈ సినిమాలో కొన్ని కీలకమైన పోర్షన్లు చూశా. అవి చూస్తే మాటలు రాలేదు. ఈ చిత్రాన్ని బిగ్ స్క్రీన్ మీద చూసేందుకు ఆసక్తిగా ఎదురు చూస్తున్నా’’ అని నారా రోహిత్ చెప్పాడు. శాతకర్ణి తన బిడ్డతో పాటు యుదానికి వెళ్ళే సన్నివేసం సినిమాకి హై లైట్ అవుతుంది అనీ శ్రియా – బాలకృష్ణ ల మధ్య ఎమోషనల్ సన్నివేశాలు చాలా రక్తి కట్టించాయి అనీ అంటున్నాడు నారా రోహిత్.

  •  
  •  
  •  
  •  

Comments