వివాదంలో గీత గోవిందం : విజయ్ పాడిన పాట తొలగింపు!

Friday, July 27th, 2018, 01:36:29 PM IST

అర్జున్ రెడ్డి సినిమాతో యూత్ లో మంచి ఫాలోయింగ్ సంపాదించిన నటుడు విజయ్ దేవరకొండ. ఆ చిత్రం అద్భుత విజయం సాధించడంతో ఓవర్ నైట్ స్టార్ గా ఎదిగిపోయిన విజయ్, ఆ తరువాత చేసిన ఏం మంత్రం వేశావే చిత్రం ప్లాప్ కావడంతో ఇకపై తన కెరీర్ లో చేయబోయే చిత్రాలు అతి జాగ్రత్తగా ప్లాన్ చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ప్రస్తుతం అతడు గీత ఆర్ట్స్2 బ్యానర్ పై చేస్తున్న చిత్రం గీత గోవిందం. ఈ చిత్రంలోని ఒక పాటను చిత్ర యూనిట్ ఇటీవల యూట్యూబ్ లో విడుదల చేసిన విషయం తెలిసిందే. కాగా ఈ పాటకు ఇప్పటివరకు 5 మిలియన్లకు పైగా వ్యూస్ దక్కాయి అంటే విజయ్ పాపులారిటీ అర్ధం చేస్తుకోవచ్చు. ఇక నిన్న విజయ్ ఈ చిత్రంలోని ఒకపాటను తానే ఆలపించిన వీడియోని యూట్యూబేలో పోస్ట్ చేసాడు.

నిజానికి అది సోను నిగమ్ మరియు రేమండ్ తో పాడించవలసి ఉండగా, వాళ్ళు అందుబాటులోలేకపోవడంతో విజయ్ పడవలసి వచ్చిందట. నిన్నంతా సోషల్ మీడియాల్లో విపరీతంగా వైరల్ గా మారిన ఈ పాటలో సీతాదేవి, సావిత్రి వంటివారిని అవమానించే విధంగా పాటలోని కొన్ని పదాలు ఉన్నాయని కొందరు నెటిజన్లు అభ్యన్తరం తెలుపడంతో చిత్ర యూనిట్ విజయ్ పాడిన ఈ పాట వీడియోను రాత్రికి రాత్రే తొలగించి వేసింది. మరొక 20 రోజుల్లో సినిమా విడుదలకు సిద్ధమవుతుండగా ఇప్పుడు ఇటువంటి వివాదం సినిమాని చుట్టుకోవడంతో చిత్ర యూనిట్ కూడా కొంత ఆలోచనలో పడ్డట్లు చెపుతున్నారు. ఇక విజయ్ తొలిసారి సింగర్ గా మారి పాడిన ఈ పాటకు ఆదిలోనే హంసపాదు ఎదురవడంతో అయన అభిమానులు కొంత నిరాశకు లోనయ్యారు. మరి చిత్ర యూనిట్ ఈ వివాదం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి….

  •  
  •  
  •  
  •  

Comments