స్టూడియోలో అంద‌రి ముందు.. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడి చెంపె ప‌గ‌ల‌గొట్టిన ప్ర‌ముఖ సినీన‌టి..!

Thursday, October 11th, 2018, 05:16:35 PM IST

హాలీవుడ్, బాలీవుడ్, టాలీవుడ్‌.. ఏ వుడ్ అయినా సరే.. హీరోయిన్లు మాత్రం కాస్టింగ్ కౌచ్ బారిన ప‌డాల్సిందే. గ‌తంలో త‌మ‌ను లైంగికంగా ఎంత వేధించినా.. సైలెంట్‌గా స‌ర్దుకుపోయేవారు. అయితే ఇప్పుడు రోజులు మారాయి.. ఇప్పుడు త‌మ‌ని లైంగికంగా ఎవ‌రు వేధించినా వెంట‌నే మీడియా ముందుకు వ‌చ్చి స‌ద‌రు వ్య‌క్తుల్ని బ‌జారుకు ఈడుస్తున్నారు నేటి న‌టీమ‌ణులు.

తాజాగా బాలీవుడ్‌లో త‌నుశ్రీ ద‌త్తా.. బాలీవుడ్ ప్ర‌ముఖ సీనియ‌ర్ న‌టుడు అయిన నానా పాటేక‌ర్ త‌న‌ని లైంగికంగా వేధించాడ‌ని సోష‌ల్ మీడియాలో పోస్టు చేసి బీటౌన్ సినీ వ‌ర్గాల్లో ప్ర‌కంప‌న‌లు రేపిన సంగ‌తి తెలిసిందే. దీంతో వ‌రుస‌గా మ‌రికొంద‌రు న‌టీమ‌ణులు బ‌య‌ట‌కు వ‌చ్చ త‌మకు ఎదురైన లైంగిక వేధింపుల‌ను మీడియా ద్వారా బ‌య‌ట‌పెడుతూ.. చాలామంది బ‌డాబాబుల బండారాన్ని బ‌జారుకు ఈడుస్తున్నారు.

అయితే ఇప్పుడు తాజాగా మ‌రో కాస్టింగ్ కౌచ్ ఇష్యూ తెర పైకి వ‌చ్చింది. బాలీవుడ్‌లో సంచ‌ల‌న విజ‌యం సాధించిన జాలీ ఎల్ఎల్‌బీ ద‌ర్శ‌కుడు సుభాష్ క‌పూర్ త‌న‌ను లైంగింగా వేధించాడంటూ లైవ్‌లోనే చెంప ప‌గ‌ల‌గొట్టింది సినీ న‌టి గీతిక త్యాగి. సుభాష్ క‌పూర్‌కి ఒక చేయి లేక‌పోయినా ద‌ర్శ‌కుడిగా మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే త‌న‌ని సుభాష్ లైంగికంగా వేధించాడ‌ని ఆరోపిస్తూ స్టూడియో లైవ్‌లో అత‌ని భార్య ముందే గీతిక చెంప ప‌గ‌ల‌గొట్టడ‌మే కాకుండా ఆ వీడియోని సోష‌ల్ మీడియాలో పోస్టు చేసింది. దీంతో ఈ ఇష్యూ ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.