క్రికెటర్ తో శృంగారం..పబ్లిసిటీ కోసమే అలా చేసిందా..!

Tuesday, October 24th, 2017, 11:20:14 PM IST

హిందీ బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన మోడల్ మరియు నటి అర్షి ఖాన్ పేరు మారుమోగుతోంది. తాను స్టార్ క్రికెటర్ ఆఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నానంటూ బోల్డ్ గా ప్రకటించి కాక రేపింది. ఆ స్టేట్ మెంట్ ఈ అమందికి కావాల్సినంత పబ్లిసిటీని తెచ్చిపెట్టింది. ఇదే కాదు అనేక కాట్రవర్సీల్లో ఈ హాట్ భామ ఇరుక్కుని ఉంది. కాగా అర్షి ఖాన్ పై మరో నటి గెహెనా వశిష్ట్ చేస్తున్న ఆరోపణలు సంచలనంగా మారాయి. బిగ్ బాస్ ల పాల్గొనేందుకు అర్షి ఖాన్ ప్రకటించిన వివరాలన్నీ పచ్చి అబద్ధాలని తేల్చేసింది.

తాను ఆఫ్రిదితో శృంగారంలో పాల్గొన్నానంటూ చెప్పుకున్న వ్యాఖ్యలలో కూడా వాస్తవం లేదని తెలిపింది. చీప్ పబ్లిసిటి కోసమే అంతటి దారుణమైన వ్యాఖ్యలు అర్షి ఖాన్ చేసినట్లు గెహెనా వశిష్ట్ ఆరోపించడం విశేషం. అర్షి ఖాన్ తన వయసు 27 అని చెప్పుకుంటోందని వాస్తవానికి ఆమె వయసు 32 అని గెహెనా తెలిపింది. ఇప్పటికే అర్షికి 50 ఏళ్ల వ్యక్తితో వివాహం జరిగిందని కూడా ఆరోపించింది.స్కూల్ డేస్ నుంచే తనకు అర్షి తో పరిచయం ఉన్నట్లు గెహెనా తెలిపింది.

  •  
  •  
  •  
  •  

Comments