అల్ల‌రి హాసినిని ఛీట్ చేసిందెవ‌రు ? ఎవ‌రా ఛీట‌ర్‌ ?

Wednesday, February 14th, 2018, 03:05:37 AM IST

‘బొమ్మ‌రిల్లు’లో అందాల హాసిని అల్ల‌రిని అంత తేలిగ్గా మ‌ర్చిపోలేం! రిచ్‌బోయ్‌ని లవ్ చేసిన ఆర్డిన‌రీ గాళ్‌గా హాసిన అభిన‌యం యువ‌త‌రం గుండెల్ని ట‌చ్ చేసింది. అల్ల‌రికి కేరాఫ్ అడ్రెస్‌గా జెనీలియా చేసిన పాత్ర‌లు మ‌హ‌దాద్భుతం. అందుకే జెన్నీ మ‌న‌ల్ని వీడి సంసార బంధ‌నంలో చిక్కుకున్నా ప‌దే ప‌దే గుర్తు చేసుకుంటున్నాం.

అయితే త‌న అల్ల‌రిని అప్పుడే మ‌ర్చిపోతే ఎలా అనుకుందేమో.. ఇదిగో ఇలా వెరైటీ అల్ల‌రితో మ‌న ముందుకు వ‌చ్చింది మ‌రోసారి. కింగ్ ఖాన్ షారూక్ ఖాన్ – కాజోల్ జంట‌గా న‌టించిన రొమాంటిక్ ల‌వ్‌స్టోరి `కుచ్ కుచ్ హోతా హై` 1988లో రిలీజై సంచ‌ల‌న విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. రొమాంటిక్ మ్యూజికల్ హిట్ మూవీ ఇది. హీరోయిజంలో కొత్త‌ద‌నం ఆవిష్క‌రించిన చిత్రమిది. ఈ సినిమాతోనే క‌ర‌ణ్ జోహార్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అయ్యాడు. తొలి ప్ర‌య‌త్న‌మే బంప‌ర్ హిట్‌. షారూక్‌కి గొప్ప సినిమాని అందించాడు. ఆ సినిమాలో రాహుల్ ఒక ఛీట‌ర్ అంటూ హీరోయిన్ కాజోల్ డైలాగులు చెబుతుంది. అందులో ఎంతో ఫ‌న్ క‌నిపిస్తుంది. ఇదిగో ఇక్క‌డ జెన్నీ-రితేష్ జంట సేమ్ టు సేమ్ దించేశారు. చాలా కాలం త‌ర్వాత జెనీలియాని ఇంత ఫ‌న్నీగా.. స్ట్ర‌యికింగ్‌గా చూసే స‌ద్భాగ్యం క‌లిగినందుకు ఫ్యాన్స్ థాంక్స్ చెబుతారేమో?