బొమ్మ‌రిల్లు హాసిని ప్రేమ‌క‌థ‌కు 10ఏళ్లు !

Saturday, February 3rd, 2018, 02:15:11 PM IST


కొన్ని ప‌రిచ‌యాలు అనూహ్యం.. అసాధార‌ణం. ప‌రిచయం స్నేహంగా మారుతుంది. అటుపై ప్రేమ‌గా పల్ల‌విస్తుంది. ఆ ప్రేమ‌కు ఎన్ని అడ్డంకులు ఎదురైనా చివ‌ర‌కు పెళ్లితో సంతోషంగా మారుతుంది. ఇలాంటి ఉద్విగ్న క్ష‌ణాల్ని బొమ్మ‌రిల్లు హాసిని జెనీలియాకి ఎదుర‌య్యాయి. దాదాప ప‌దేళ్ల క్రితం క‌ర్నాట‌క ముఖ్య‌మంత్రి ఎస్‌.ఎం.కృష్ణ సుపుత్రుడు కం బాలీవుడ్ హీరో రితేష్‌ని సెట్‌లో కలిసిన జెనీలియా, అటుపై అతడితో ప్రేమ‌లో ప‌డింది. జెనీలియా యాక్టివ్‌నెస్ చూసి రితేష్ మ‌న‌సు పారేసుకున్నాడు. కుల‌మ‌తాలు, ఆర్థిక అస‌మాన‌త చూడ‌కుండా జెనీలియాని నాలుగేళ్ల పాటు ప్రేమించి చివ‌రికి క‌ష్టంగా ఇంట్లో పెద్ద‌ల్ని ఒప్పించి పెళ్లి చేసుకున్నాడు. జెనీలియా- రితేష్ జంట‌కు ప్ర‌స్తుతం ఇద్ద‌రు పిల్ల‌లు. ఆరేళ్ల కింద‌ట వివాహం జ‌రిగింది.

అయితే నేడు ఈ జంట యానివ‌ర్శ‌రీ డే. పెళ్లి మ‌హోత్స‌వం ఎంతో గొప్ప‌ది.. అందుకే ప్ర‌త్యేకంగా ఈరోజును సెల‌బ్రేట్ చేసుకుంటున్నారు. పాత జ్ఞాప‌కాల్ని రివైండ్ చేస‌కుంటున్నారు. బొమ్మ‌రిల్లు జెనీలియా – రితేష్ దేశ్‌ముఖ్ ప్రేమాయ‌ణానికి ప‌దేళ్లు పూర్త‌యిన ఈ సంతోష స‌మ‌యాన‌.. త‌మ‌ని తాము రీఇన్వెంట్ చేసుకుంటున్నారు. త‌న జీవితంలో జెనీలియా ప్ర‌త్యేక‌త‌, ప్రాధాన్య‌త గురించి గొప్పగా అభివ‌ర్ణించాడు రితేష్‌. జెనీలియాతో త‌న అనుబంధంపై ట్వీట్లు చేశాడు.. నేడు త‌న పెళ్లిరోజు సంద‌ర్భంగా.. “నా బ‌లం.. మంచిత‌నం.. సంతోషం.. బ్లెస్ అన్నీ నీ వ‌ల్ల‌నే..నువ్వంటే ఎంతో ఇష్టం. న‌న్ను నేను క‌నుగొన్నా. హ్యాపీ యానివ‌ర్శ‌రీ బైకూ..“ అంటూ ట్విట్ట‌ర్‌లో త‌న భార్య‌పై ప్రేమ‌ను వ్య‌క్తం చేశాడు రితేష్‌. జెనీలియా సైతం త‌న ట్విట్ట‌ర్‌లో నేటి ప్ర‌త్యేక‌త గురించి ట్వీట్ చేసింది. త‌న భ‌ర్త రితేష్‌కి శుభాకాంక్ష‌లు తెలిపింది. ప్రేమ‌లో ఉన్న ఘాడ‌త‌ను త‌న‌దైన శైలిలో వ్య‌క్త‌ప‌రిచింది. “గాడ్ ఫెయిరీ టేల్ సృష్టిక‌ర్త‌. మ‌న జీవితంలో అది జ‌రిగింది“ అని సంతోషాన్ని వ్య‌క్తం చేసింది జెన్నీ. నేడు రితేష్‌- హాసిని వెడ్డింగ్ డే సంద‌ర్భంగా.. ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు.