హెడ్ ఫోన్స్ సిద్ధం చేసుకోమంటున్న సూపర్ స్టార్!

Wednesday, January 24th, 2018, 12:09:40 PM IST


సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సక్సెస్ఫుల్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో డివివి ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై డివివి దానయ్య నిర్మిస్తున్న నూతన చిత్రం తాలూకు ఫస్ట్ లుక్ ని ఈ నెల 26 న గణతంత్ర దినోత్సవ కానుకగా విడుదల చేయనున్న విషయం తెలిసిందే. అయితే దీనికి సంబంధించి కొరటాల శివ చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు మీడియా లో సంచలనం సృష్టిస్తోంది. చిత్రం టైటిల్ లోగో తో పాటు మహేష్ బాబు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ఆడియో ను వినడానికి అభిమానులందరూ రేపు ఉదయం 7 గంటలకు సిద్ధంగా వుండండి అని ఆయన ఒక ట్వీట్ చేశారు. ఇదివరకు ఫస్టులుక్ అంటే పోస్టర్ లేక టైటిల్ లోగో వచ్చేవి కానీ ఇలా టైటిల్ తో పాటు ఫస్ట్ ఆడియో కూడా డైలాగ్స్ తో కలిపి రిలీజ్ చేసే ఒక కొత్తపద్దతికి తెర తీసింది ఈ చిత్రం. విశేషం ఏమిటంటే ట్విట్టర్ లో కొరటాల పోస్ట్ వచ్చిన కొన్ని గంటల్లోపే అది మొత్తం ఇండియా లోని గూగుల్ ట్రెండ్స్ లోనే రెండవ స్థానంలో నిలిచింది. దీన్ని బట్టి చూస్తే ఈ చిత్ర ఆడియో కూడా రికార్డులు నెలకొల్పేలా వుంది. అయితే ఇప్పటివరకు ఈ చిత్ర విషయంలో మాత్రం క్లారిటీ రాలేదు. చిత్ర యూనిట్ విడుదల తేదీని కూడా అదే రోజు ప్రకటిస్తుందేమో అని ప్రేక్షకులు, అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు.