కోడి పందేల కోసం ! స్వీపింగ్ మిషీన్ లు రెడీ

Tuesday, December 27th, 2016, 12:00:44 PM IST

hens
కోడి సంబరాలకి ఇంకా టైం ఉన్నా కూడా పందెం రాయుళ్ళు కోడి పందేలు ఇప్పటి నుంచే ప్రణాళిక తో వెళుతున్నారు. ఉభయ గోదావరి జిల్లాలలో బాగా ఫేమస్ గా జరిగే ఈ పందేలు కోర్టు ఆదేశాలు ఉన్నా కూడా చక్కగా సాగుతూ ఉంటాయి. ఒక పక్క పెద్ద నోట్ల రద్దు అంశం ఇబ్బంది పెడుతున్నా కూడా నిర్వాహకులు ఇప్పటి నుంచే కొత్త కొత్త స్టైల్ లో తమ దందా సాగిస్తున్నారు. కోడి పందాలను నిర్వహించవద్దని హైకోర్టు ఆదేశాలు ఉన్న నేపథ్యంలో వాటిని తూ.చ. తప్పకుండా అమలు చేస్తామని చెప్పిన పోలీసులు పండగ మూడు రోజులూ చేతులెత్తేసి ప్రేక్షకపాత్రకే పరిమితమయ్యారు. ఈ సారి పెద్ద నోట్ల రద్దు కూడా ఇక్కడి వారికి ఇబ్బంది కర విషయమే.దీంతో పందాల నిర్వాహకులు కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు తెలుస్తోంది. స్వైపింగ్ మిషన్లను వినియోగించే ఆలోచన కూడా చేస్తున్నారని తెలిసింది. అదే సమయంలో భూములను – ఆస్తులను ఫణంగా పెట్టి పందాలు నిర్వహించేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. అదే జరిగితే పందాల్లో పాల్గొని ఓడిన వారి కుటుంబాలు రోడ్డున పడక తప్పదు. పోలీసులు ఈసారైనా వీటిని అడ్డుకోకపోతే పరిస్థితులు అత్యంత భయానకంగా మారే ప్రమాదం ఉందని పలువురు వాపోతున్నారు.

  •  
  •  
  •  
  •  

Comments