కిడ్నాప్ డ్రామా ఆడిన ఘట్కేసర్ యువతి ఆత్మహత్య

Wednesday, February 24th, 2021, 02:08:30 PM IST

ఘట్ కేసర్ లో కిడ్నాప్ డ్రామా ఆడిన ఫార్మసీ విద్యార్ధిని ఆత్మహత్య కి పాల్పడింది. నిద్ర మాత్రలు మింగి ఆత్మ హత్య చేసుకున్నట్లు వైద్యులు గుర్తించారు. అయితే కిడ్నాప్ డ్రామా తో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ యువతి కిడ్నాప్ డ్రామా అనంతరం మేనమామ ఇంట్లో ఉంటున్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే క్రమం లో బుధవారం నాడు నిద్ర మాత్రలు మింగి ఆత్మ హత్య కి పాల్పడటం సంచలనం సృష్టిస్తోంది. ఆమెను ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన సమయానికి, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడం జరిగింది. అయితే యువతి ఆత్మహత్య కి పాల్పడటం పట్ల పోలీస్ అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.