పవన్ కళ్యాణ్ కే ఇచ్చారు..బావమరిదికి ఇవ్వకుండా ఉంటారా..!

Thursday, January 11th, 2018, 08:25:30 PM IST

నంది అవార్డులతో మంచి మార్కులు కొట్టేయాలని భావించిన బాబు ప్రభుత్వం వ్యూహం బెడిసి కొట్టింది. కానీ చిత్ర పరిశ్రమని ఆకట్టుకునే ప్రయత్నాలు మాత్రం ఏపీ ప్రభుత్వం కొనసాగిస్తూనే ఉంది. నిన్ననే విడుదలైన పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి చిత్రానికి ఏపీ ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తొలి వారం రోజుల పాటు రోజుకు 7 షోలు ప్రదర్శించుకునేలా అనుమతి ఇచ్చింది. పవన్ కళ్యాణ్ చంద్రబాబుకు సన్నిహితుడు కాబట్టి అనుమతులు వచ్చాయని కామెంట్లు వినిపించాయి.

తాజాగా బాలయ్య జై సింహా చిత్రానికి కూడా చంద్రబాబు ప్రభుత్వం కానుక అందించింది. ఇప్పటికే అజ్ఞాతవాసి చిత్రం విడుదలై సందడి చేస్తోంది. సంక్రాంతి కానుకగా బాలయ్య జై సింహా చిత్రం రేపు ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈనేపథ్యంలో ఏపీ ప్రభుత్వం బాలయ్య అభిమానులకు గుడ్ న్యూస్ తెలిపింది. శుక్రవారం నుంచి ఈ నెల 16 వరకు 7 షోలు ప్రదర్శించుకునేలా ఉత్తర్వులు జారీ చేసింది. పవన్ కళ్యాణ్ చిత్రానికే అనుమతినిచ్చారు. ఇక వియ్యంకుడి చిత్రానికి చంద్రబాబు అనుమతి ఇవ్వకుండా ఎలా ఉంటారు అని చిత్ర వర్గాలు ఆసక్తికరమైన కామెంట్లు చేస్తున్నాయి.