త్రివిక్రమ్ పుట్టిన రోజున పవన్ ఫాన్స్ కి అదిరిపోయే గిఫ్ట్ !

Saturday, November 4th, 2017, 03:54:51 PM IST

పవన్ కళ్యాణ్ – త్రివిక్రమ్ కాంబినేషన్లో రాబోతున్న చిత్ర విశేషాలకు అభిమానులు నిరీక్షణ కొనసాగుతోంది. ఎట్టకేలకు వారి పడిగాపులకు బ్రేక్ పడనుంది. త్రివిక్రమ్ పుట్టిన రోజున చిత్ర యూనిట్ అదిరిపోయే గిఫ్ట్ అందించనుంది. మొదట త్రివిక్రమ్ ఉన్నరోజు నవంబర్ 7న పవన్ 25 వ చిత్ర టైటిల్ లోగోని ఆవిష్కరిస్తారని అంతా భావించారు. తాజాగా హారిక అండ్ హాసిని ఈ విషయం క్లారిటిని ఇచ్చింది.

త్రివిక్రమ్ పుట్టిన రోజు సందర్భంగా ఫస్ట్ సాంగ్ ‘బైటికొచ్చి చూస్తే’ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీనితో ఫాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఈ విషయం నిమిషాల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారిపోయింది. అనిరుద్ అందించిన సంగీతాన్ని వినేందుకు అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే పవన్ పుట్టిన రోజు నాడు ఈ సాంగ్ బిట్ ని విడుదల చేసిన సంగతి తెలిసిందే.

  •  
  •  
  •  
  •  

Comments