ట్రాయ్ రిపోర్ట్: డౌన్‌లోడ్ స్పీడ్‌లో మళ్ళీ జియోనే టాప్..!

Tuesday, September 17th, 2019, 11:53:45 PM IST

ఇంటర్నెట్ అంటే ప్రస్తుతం కావలసింది స్పీడ్. అయితే ఇంటర్‌నెట్ స్పీడ్ బాగా ఉంటే నెట్‌లో ఏ పనైనా చాలా సులువుగా చేసుకోవచ్చు. అయితే కొన్ని కొన్ని సార్లు ఇంటర్‌నెట్ పనిచేయకపోవడం, స్పీడ్ తగ్గిపోవడం వంటివి జరుగుతుంటాయి. అలాంటి సందర్భాలలో ఆయా ఇంటర్‌నెట్ కంపెనీలపై ఎక్కడ లేని కోపం ముంచుకొస్తుంది.

అయితే ట్రాయ్ లెక్కల ప్రకారం ఆగస్ట్ నెలలో జియో సగటు డౌన్‌లోడ్ స్పీడ్ 21.3 ఎంబీపీఎస్ కాగా డౌన్‌లోడ్ స్పీడ్‌లో మళ్ళీ టాప్ ప్లేస్‌ను జియోనే దక్కించుకుంది. అయితే అప్‌లోడ్ స్పీడ్‌లో మాత్రం వోడాఫోన్ మొదటి ప్లేస్‌లో నిలిచింది. అయితే భారతీ ఎయిర్‌టెల్ మాత్రం డౌన్‌లోడ్ స్పీడ్ 8.8 ఎంబీపీఎస్‌తో వెనకబడడమే కాకుండా, పనితీరు కూడా బాగాలేదన్న వార్తలు వినిపిస్తున్నాయి.