కరోనా కాటుకి బలి అయిన మాజీ ఆరోగ్య శాఖ మంత్రి!

Tuesday, July 7th, 2020, 02:22:32 AM IST


కరోనా వైరస్ మహమ్మారి ఏ ఒక్కరినీ విడిచి పెట్టడం లేదు. దీని భారిన పడి రోజూ భారత్ లో వందల సంఖ్యలో ప్రాణాలను కొలోతున్నారు. వేల సంఖ్యలో కరోనా వైరస్ భారిన పడుతున్నారు. అయితే తాజాగా గోవా మాజీ ఆరోగ్య శాఖ మంత్రి సురేష్ అమెంకర్ కరోనా వైరస్ భారిన పడి మృతి చెందారు. ఈ విషయాన్ని స్వయంగా గా గోవా ఆరోగ్య శాఖ మంత్రి వెల్లడించారు. అయితే ఇతని వయసు 68 సంవత్సరాలు అని తెలుస్తోంది. అంతేకాక గత ప్రభుత్వం హయం లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు గా కూడా వ్యవహరించినట్లు తెలిపారు. అయితే ఆయన మృతి కి గోవా ముఖ్యమంత్రి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పార్టీ కి, రాష్ట్రానికి ఆయన చేసిన సేవలు చిరస్మరణీయం అని వ్యాఖ్యానించారు.

కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ఇప్పటికే భారత్ లో 20 వేల మందికి పైగా ప్రాణాలను కోల్పోయారు. దాదాపు 7 లక్షల మందికి పైగా కరోనా వైరస్ వ్యాధి తో బాధపడుతున్నారు. అయితే ఈ పాజిటివ్ కేసులు దేశంలో మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.