హుస్నాబాద్ కి గోదావరీ జలాలు – మంత్రి హరీష్ రావు హామీ

Wednesday, November 20th, 2019, 03:00:41 AM IST

సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ నియోజక వర్గం లోని కోహెడ, హుస్నాబాద్ మండలం లోని విద్యుత్ సబ్‌స్టేషన్లను,కోహెడలో నూతనంగా నిర్మించిన మోడల్ పోలీస్ స్టేషన్ భవనాన్ని, హుస్నాబాద్ మార్కెట్ యార్డులో మక్కల కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ ఆర్థిక శాఖా మంత్రి హరీష్ రావు నేడు ప్రారంభించారు. కాగా ఆ తరువాత తన నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులతో హరీష్ రావు ఒక సమీక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కాగా ఆతరువాత ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన గత కొద్దీ కాలంగా చీకట్లో మగ్గుతున్న ఇక్కడి పలు ప్రాంతాలకు విద్యుత్ కాంతులు విరజిల్లాలని హరీష్ రావు కోరుకున్నారు.

ఇకపోతే హుస్నాబాద్ నియోజక వర్గంపై సీఎం కేసీఆర్ ప్రత్యేకమైన దృష్టిని పెట్టారని, చాలా తొందర్లోనే ఈ ప్రాంతానికి గౌరవెల్లి రిజర్వాయర్ ద్వారా గోదావరి జలాలు రానున్నాయని, అంతేకాకుండా కేవలం 30 రోజుల ప్రణాళిక ద్వారా మనకున్న 70 ఏళ్ళ దారిద్య్రాన్ని పోగొట్టుకున్నామని మంత్రి హరీష్ రావు వెల్లడించారు. ఇకపోతే రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టినటువంటి మిషన్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీరు అందుతుందని, ఆ నీటిని మనం అందరం కూడా చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలని మంత్రి హరీష్ రావు ప్రజలందరికి సూచించారు.