బీజేపీకి ఎదురు దెబ్బ.. వైసీపీలోకి ఎంట్రీ ఇస్తున్న కీలక నేత ఫ్యామిలీ..!

Sunday, December 8th, 2019, 10:53:25 PM IST

ఏపీలో ఈ ఎన్నికలలో వైసీపీ భారీ మెజారిటీతో అధికారంలోకి వచ్చాక ఇతర పార్టీల నుంచి వలసలు పెరిగిపోయాయి. టీడీపీ నుంచి ఇప్పటికే ముఖ్యనేతలు వైసీపీలో చేరిపోయారు. అయితే టీడీపీ నుంచి చాలా మంది బీజేపీలో చేరుతుంటే బీజేపీ నుంచి మాత్రం ఒక ఫ్యామిలీ వైసీపీలో చేరేందుకు రెడీ అయిపోయింది.

అయితే బీజేపీ మాజీ ఎంపీ గోకరాజు గంగరాజు కుటుంబ సభ్యులు వైసీపీలో చేరబోతున్నారు. గోకరాజు గంగరాజు తనయుడు రంగరాజు, గోకరాజు సోదరులు నరసింహరాజు, రామరాజు రేపు సాయంత్రం సీఎం వైఎస్ జగన్ సమక్షంలో వైసీపీ కండువా కప్పుకోనున్నారు. 2014 ఎన్నికలలో బీజేపీ తరఫున నర్సాపురం నుంచి ఎంపీగా పోటీచేసి గెలుపొందిన గోకరాజు గంగరాజు మొదటి నుంచి బీజేపీకి సన్నిహితంగా ఉంటూ కీలకనేతగా ఉన్నారు. అయితే ఒక్కసారిగా వారి ఫ్యామిలీ వైసీపీలో చేరుతుండడం ఏపీలో బీజేపీకి పెద్ద ఎదురు దెబ్బ అనే చెప్పాలి.