మహేష్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్…రజినీ ఫ్యాన్స్ కి బ్యాడ్ న్యూస్

Friday, April 13th, 2018, 12:05:08 PM IST

మహేష్ అభిమానులకు గుడ్ న్యూస్ మహేష్ బాబు అభిమానులు “ భరత్ అను నేను సినిమా కోసం ఎదురు చూసినట్టు ఇప్పటి వరకు ఏ సినిమా కోసం కూడా ఎదురు చూసి ఉండరేమో..వరుస ఫ్లాపుల తర్వాత మహేష్ బాబు నటిస్తున్న చిత్రం కావడంతో ఈ సినిమాపై భారి ఆశలే పెట్టుకున్నారు అభిమానులు. అయితే వారిని ఒక వార్త తీవ్రంగా కలవరపెట్టింది. ‘భరత్ అనే నేను’ చిత్రం ఏప్రిల్ 20న విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అయితే భరత్ విడుదలైన వారానికే ఏప్రిల్ 27న రజినీకాంత్ నటించిన ‘కాలా’ చిత్రం విడుదల అవుతుందని ప్రచారం జరిగింది.

ఇక రజనికి ఉన్న క్రేజ్ ముందు మహేష్ తెలిపోతాడు. ఆ ప్రభావం సినిమా విజయంపై కూడా పడే అవకాశం లేకపోలేదు. దీనితో ఆ సినిమా విడుదల వాయిదా పడితే బాగుండు అని కూడా కోరుకున్నారు అభిమానులు. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. రజినీకాంత్ ‘కాలా’ చిత్రం ఏప్రిల్ 27న విడుదలవడం లేదని తెలుస్తుంది. రంజిత్. పా దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఏప్రిల్ 27న విడుదల చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు. అయితే ప్రస్తుతం తమిళనాడులో ఉన్న పరిస్థితుల దృష్ట్యా ఈ చిత్ర విడుదల జూన్‌కి వెళ్లిపోయినట్లుగా సమాచారం. కావేరీ జలాలపై తమిళనాట జరుగుతున్న నిరసన కారణంగా ‘కాలా’ చిత్రాన్ని వాయిదా వేసినట్లుగా తెలుస్తుంది. దీనితో మహేష్ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు.