TSRTC ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఇక జీతాల్లో కోతల్లేవ్..!

Tuesday, July 7th, 2020, 12:33:44 PM IST

తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పబోతుంది. కరోనా లాక్‌డౌన్ కారణంగా ఆర్టీసీ బస్సులు నడవకపోవడంతో మార్చి నెల నుంచి సిబ్బందికి సగం జీతాలే అందిస్తూ వస్తుంది ఆర్టీసీ యాజమాన్యం.

అయితే ప్రస్తుతం రాస్ట్రంలో అన్‌లాక్ ప్రక్రియ మొదలు కావడంతో హైదరాబాద్ సిటీ బస్సులు మినహా జిల్లాల వారిగా బస్సులను నడుపుతూ వస్తుంది. అయితే సంస్థ ఆర్థిక పరిస్థితి గతంతో పోలిస్తే ఇప్పుడు కాస్త మెరుగుపడటం వలన జూన్ నెల కోతల్లేకుండా పూర్తి జీతాలు చెల్లించాలని యాజమాన్యం నిర్ణయించినట్టు తెలుస్తుంది.