పవన్ కళ్యాణ్ నటిస్తాడట .. కానీ ?

Wednesday, January 24th, 2018, 03:38:58 PM IST


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఇకపై సినిమాలు చేయను అని చెప్పినప్పటినుండి అయన అభిమానులు తీవ్ర నిరాశలో మునిగిపోయారు. తన అభిమాన నటుడిని ఇకపై తెరపై చూసుకోలేమా అనే ఆలోచనలో పడ్డారట .. అయితే వారికి ఇది నిజంగా గుడ్ న్యూస్ ? ఎందుకంటే పవన్ కళ్యాణ్ పూర్తిగా సినిమాలు వదిలేయడం లేదట !! అవును అయితే హీరోగా పూర్తీ సినిమాలు కాకుండా గెస్ట్ పాత్రలో నటించేందుకు రెడీ అని చెప్పాడట. తనకు జీవితాన్ని ఇచ్చిన సినిమాను వదులుకోవడం ఆయనకు ఇష్టం లేదట. ఇక ఇప్పటికే రెండు సినిమాల్లో అయన నటించాల్సి ఉంది .. కానీ ఆ సినిమాలను చేయనని చెప్పాడట. అయితే పవన్ కళ్యాణ్ సొంత బ్యానర్ పై సినిమాలను నిర్మిస్తాడట. సో పవన్ కళ్యాణ్ ను అప్పుడప్పుడు గెస్ట్ గా చేసుకోవచ్చని ముచ్చట పడుతున్నారా .. ఎంజాయ్.