చంద్రబాబు పధకాలకు బ్రహ్మరధం

Thursday, September 18th, 2014, 12:48:21 PM IST


ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించిన పధకాలకు ప్రజలు బ్రహ్మరధం పడుతున్నారనిఆంధ్రప్రదేశ్ నీటిపారుదల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వర రావు అన్నారు. ఈ రోజు ఆయన ఉప ముఖ్యమంత్రి కెఈ కృష్ణమూర్తితో కర్నూలులో భేటి అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మీడియా తో మాట్లాడారు.. కృష్ణాజలాలను వృధాకానివ్వమని, హద్రీనీవా ప్రాజెక్టును యుద్దప్రాతిపదికన పూర్తీ చేస్తామని ఉమామహేశ్వరరావు అన్నారు. పులిచింతలలో పూర్తీ స్థాయి నిటిని నిల్వ ఉంచుతామని.. ముంపుకు గురయ్యే గ్రామాలకు తక్షణమే నష్టపరిహారం అందేలా చూస్తామని చంద్రాబాబు నాయుడు పేర్కొన్నారని ఆయన తెలిపారు. ఈ విషయమై రెండు రాష్ట్రాల సిఎస్ లు నేడు సమావేశం అవుతున్నారని దేవినేని ఉమామహేశ్వర రావు పేర్కొన్నారు.