ఈ దర్శకుడికి గోపీచంద్ హ్యాండిచ్చినట్టేనా ?

Tuesday, July 31st, 2018, 01:28:00 AM IST

అంటే అవుననే అంటున్నాయి టాలీవుడ్ వర్గాలు. ప్రస్తుతం గోపీచంద్ పరిస్థితి కూడా అంత బాగాలేదు. అయన చేస్తున్న సినిమాలన్నీ వారుసగా డిజాస్టర్స్ అవుతూనే ఉన్నాయి. సోషల్ కంటెంట్ అంటూ తాజాగా పంతం పట్టి సక్సెస్ కొట్టాలనుకుంటే అదికాస్తా తుస్సుమంది. కంటెంట్ లోనే సరైన విషయం లేకపోవడంతో జనాలకు నచ్చలేదు. దాంతో తదుపరి సినిమా విషయంలో టెన్షన్ మీదున్నాడు. ఇక తాజాగా గోపీచంద్ తో మరో సినిమా చేయాలనీ కథ కూడా సిద్ధం చేసుకున్న దర్శకుడికి అయన హ్యాండీ ఇచ్చాడని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇంతకీ ఆ దర్శకుడు ఎవరో కాదు సంపత్ నంది. ఇదివరకే సంపత్ నందితో గోపీచంద్ తీసిన గౌతమ్ నంద సినిమా సమయంలో సంపత్ మేకింగ్ నచ్చి మరో సినిమా కలిసి చేద్దామని మాట ఇచ్చాడట గోపీచంద్. అయితే గౌతమ్ నంద విడుదలై ప్లాప్ అవ్వడంతో ఇప్పుడు మరోసారి ఆ దర్శకుడితో సినిమా చేయడానికి రెడీ గా లేడట గోపీచంద్. గోపీచందే కాదు ఏ హీరోకుడా సంపత్ కు అవకాశం ఇవ్వడం లేదన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఏమైంది ఈవేళ సినిమాతో దర్శకుడిగా క్రేజ్ తెచ్చుకున్న సంపత్ నంది రామ్ చరణ్ తో రచ్చ చేసి హిట్ దర్శకుల లిస్ట్ లో పడ్డాడు. ఆ తరువాత పవన్ కళ్యాణ్ పిలిచి సర్దార్ గబ్బర్ సింగ్ అవకాశం ఇచ్చాడు .. మధ్యలో ఏమైందో ఏమో .. ఆ సినిమా నుండి తప్పుకున్న సంపత్ నంది వెంటనే రవితేజతో బెంగాల్ టైగర్ సినిమా చేసాడు. అది యావరేజ్ గానే మిగిలింది. సో మొత్తానికి సక్సెస్ లేని ఈ దర్శకుడు అటు నిర్మాతగా మారి పేపర్ బాయ్ సినిమా చేస్తున్నాడు. మరి సంపత్ నెక్స్ట్ సినెమా ఎవరితో అన్న సందేహం తీరేదెన్నడో చూడాలి.

  •  
  •  
  •  
  •  

Comments