హీరో గోపీచంద్ ఇంటికి మరో వారసుడొచ్చాడు!

Thursday, September 13th, 2018, 12:37:34 PM IST

వినాయక చవితి రోజు అందరిరూ ఎంతో ఆనందంగా ఉంటారు. అయితే అదే పర్వదినం వేళ ఇంట్లోకికొత్త గణనాథుడు ఎంట్రీ ఇస్తాడు. అయితే టాలీవుడ్ హీరో గోపీచంద్ ఇంట్లో మాత్రం గణేశుడితో పాటు వారసుడు కూడా ఒకేసారి వచ్చాడు. దీంతో పండగరోజు ఆనందాలు

రెట్టింపయ్యాయి. ముందుగానే గోపీచంద్ – రేష్మ దంపతులకు ఒక కుమారుడు విరాట్ కృష్ణ(3) జన్మించిన సంగతి తెలిసిందే. ఇక రేష్మ ఈ రోజు ఉదయం మరో పండంటి మగ పిల్లాడికి జన్మనిచ్చారు. తెల్లవారుజామున 5.40 గంటలకు బాబు పుట్టినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. రేష్మాతో గోపికి 2013లో వివాహమైన సంగతి తెలిసిందే. ప్రముఖ హీరో శ్రీకాంత్ మేనకోడలే రేష్మ.

  •  
  •  
  •  
  •  

Comments