గోపీచంద్ నెక్స్ట్ సినిమా సెట్స్ పైకి ?

Friday, September 7th, 2018, 10:55:26 PM IST

మాస్ హీరో గోపీచంద్ కు ఈ మధ్య టైం బాగాలేదు. చేసిన సినిమాలన్నీ వరుసగా ప్లాపులు అవుతున్నాయి. బిన్నంగా ట్రై చేసిన కూడా లాభం లేకపోయింది. దాంతో కొత్త దర్శకుడితో పంతం అంటూ మాస్ యాక్షన్ సినిమా చేసిన అది వర్కవుట్ కాలేదు. దాంతో కాస్త గ్యాప్ తీసుకున్న గోపీచంద్ నెక్స్ట్ సినిమాకు ఓకే చెప్పాడు. ఈ సారి కూడా అయన కొత్త దర్శకుడితోనే సినిమా చేస్తున్నాడు. కొత్త దర్శకుడు కుమార్ దర్శకత్వంలో తెరకెక్కే ఈ సినిమా లవ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉంటుందని తెలిసింది.

మరి యాక్షన్ సినిమాలు చేస్తే జనాలు రీసివ్ చేసుకోవడం లేదని .. లౌక్యం తరహాలో ఫన్ అండ్ ఎంటర్ టైనర్ కె ఆసక్తి చూపిస్తున్నాడు. దాంతో పాటు అయన మరో సినిమాకు ఓకే చెప్పినట్టు తెలిసింది. అయన నెక్స్ట్ సినిమా సంపత్ నంది దర్శకత్వంలో ఉంటుందని టాక్. ఇటీవలే వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, కథ నచ్చడంతో గోపీచంద్ ఓకే చెప్పాడట. ప్రస్తుతం సంపత్ నంది స్క్రిప్ట్ వర్క్ పై బిజీగా ఉన్నాడు.

  •  
  •  
  •  
  •  

Comments