షాక్ .. క్రియేటివ్ దర్శకుడితో గోపీచంద్ ప్రయోగం ?

Friday, October 20th, 2017, 10:00:14 AM IST

హీరో గోపీచంద్ నటిస్తున్న ఆక్సీజెన్ త్వరలో విడుదలకు సిద్ధం అయింది. ఇప్పటికే షూటింగ్ పూర్తీ చేసుకున్న ఈ సినిమా త్వరలో విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ మధ్య గోపీచంద్ కు వరుస పరాజయాలు టెన్షన్ పెడుతున్నాయి. ఈ మద్యే విడుదలైన గౌతమ్ నందా కూడా అట్టర్ ప్లాప్ అవ్వడంతో వరుసగా సినిమాలన్నీ ఢమాల్ మంటుండంతో మంచి హిట్ కోసం గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు. తాజాగా అయన క్రియేటివ్ దర్శకుడు కృష్ణవంశీ తో నెక్స్ట్ సినిమాకు సిద్ధం అయ్యాడట ? అవును గతంలో కృష్ణవంశీ తో గోపీచంద్ చేసిన మొగుడు సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది. అయినా మరోసారి వీరిద్దరూ కలిసి సినిమా చేయడానికి ఫిక్స్ అయ్యారట !! ఇప్పటికే కృష్ణవంశీ తో కథ చర్చలు జరుపుతున్నాడట గోపీచంద్. సో త్వరలోనే ఈ ప్రాజెక్ట్ పట్టాలు ఎక్కే అవకాశం ఉందంటున్నారు సినీ జనాలు?

  •  
  •  
  •  
  •  

Comments