వైసీపీపై అదిరిపోయే సెటైర్లు వేసిన టీడీపీ నేత బుచ్చయ్య చౌదరి..!

Wednesday, July 1st, 2020, 01:17:34 AM IST


ఏపీ అధికార పార్టీ వైసీపీపై ప్రతిపక్ష పార్టీ టీడీపీ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి అదిరిపోయే సెటైర్లు గుప్పించారు. ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన ఏపీలో జరుగుతున్న అంశాలను లేవనెత్తుతూ తనదైన శైలిలో వ్యంగ్యాస్త్రాలు సంధించారు.

“మూడు మాస్కులు అన్నారు క్వాలిటీ లేకపోయే.. మూడు రాజధానులు అన్నారు.. క్లారిటీ లేకపోయే.. మూడు రంగులు అన్నారు ఒక రంగుకి మిగిలిపోయే.. మొత్తానికి ఈ మూడు ఉన్నది వైసీపీ ప్రభుత్వానికి మాడు పగిలేందుకే అనుకుంటా” అని ఎద్దేవా చేశారు.