టీడీపీలో ఆ తెల్ల ఏనుగులు ఎవరు?బుచ్చయ్య చౌదరి సంచలనం!

Wednesday, August 14th, 2019, 12:41:29 PM IST

ప్రస్తుతం తెలుగుదేశం పార్టీలో ఏం జరుగుతుందో తెలీని పరిస్థితి నెలకొంది అని చెప్పాలి.ఎన్నికల్లో దారుణమైన ఓటమి తర్వాత మళ్ళీ తెలుగుదేశం పార్టీ మొదటి మెట్టు నుంచి ప్రారంభం కావాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి.ఇదిలా ఉండగా పార్టీ బలోపేతానికి చంద్రబాబు నిరంతరం శ్రమిస్తుండగా ఆ పార్టీకు చెందిన కీలక నేతలు అసలు తమ పార్టీ వైఫల్యానికి గల కొన్ని ఆశ్చర్యకరమైన నిజాలను వెల్లడిస్తున్నారు.నిన్న విజయవాడలో అందుకు సంబంధించిన మీటింగును పార్టీ అధినేత చంద్రబాబు నిర్వహించిన సంగతి తెలిసిందే.

ఈ మీటింగుకు సంబంధించి అదే పార్టీకు చెందిన మరో కీలక నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి కొన్ని సంచలన వ్యాఖ్యలు చేసారు.తమ పార్టీలోని తెల్ల ఏనుగులు ఎక్కువయ్యిపోయారని వారు పోటీ చేసి గెలిచినా ఎలాంటి ఉపయోగం లేదని కొంతమంది ఓటమి పాలై కూడా పదవులు అబుభవిస్తున్నారని అలాంటి వారు పార్టీకు అనవసరం అన్నట్టుగా కామెంట్స్ చేసారు.అంతే కాకుండా చంద్రబాబు ఈసారి అలంటి వారిని పక్కన పెట్టి కొత్త రక్తం యువతకు అధిక ప్రాధాన్యత ఇచ్చే యోచనలో ఉన్నారని కూడా వెల్లడించారు.మరి టీడీపీలో ఉన్నటువంటి ఆ తెల్ల ఏనుగులు ఎవరో..?