చంద్రబాబు తన ఇంటిని తానే కూల్చి వేయాలి… ఎందుకో తెలుసా?

Sunday, September 22nd, 2019, 09:55:40 AM IST

కృష్ణానది కరకట్ట వద్ద ప్రకాశం బ్యారేజ్ ఎగువన గల అయిదు ఇళ్ల నిర్మాణాలను కూల్చివేయడానికి నోటీసులు అందించారు ప్రభుత్వ అధికారులు. అందులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నివాసం కూడా వుంది. అక్రమ నిర్మాణాలని, నిబంధనల ప్రకారం ఇళ్ల నిర్మాణం జరగలేదని ప్రభుత్వం ఈ చర్యలు తీసుకున్నట్లు సమాచారం. గతం లో నోటీసులు కూడా అందించారు. చంద్రబాబు నివాసం వద్ద ఇంటి గోడకు నోటిసులని అందించారు.

గతం లో మొత్తం 31 కట్టడాలకు సంబంధించి నోటీసులు ఇవ్వగా 20 మంది వాదనలు విన్న ప్రభుత్వం, ఐదు కట్టడాలను కూల్చివేయడానికి నిర్ణయం తీసుకుందని సమాచారం. ప్రభుత్వం అందుకు సమయాన్ని కూడా ఇచ్చింది. వారం రోజుల్లోగా కట్టడాలను కూల్చివేయాలని, లేదంటే సీఆర్డీఏ చర్యలు తీసుకోనుందని వివరించింది. చంద్రబాబు తన ఇంటిని తానే కూల్చివేస్తారో, ప్రభుత్వం పై పోరాటం చేస్తారో వేచి చూడాలి. చంద్రబాబు తో సహా టీడీపీ నేతలంతా వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. కక్ష సాధింపు చర్యలు అని పలుమార్లు పేర్కొన్న టీడీపీ నేతలు, ఈ విషయం లో ఎలా స్పందిస్తారో చూడాలి.