ఇల్లు కట్టుకుంటే రెండున్నర లక్షలు ఇస్తారు

Saturday, February 11th, 2017, 11:02:23 AM IST


మధ్యతరగతి జనాలకి కేంద్ర ప్రభుత్వం సూపర్ న్యూస్ చెవిన వేసింది. రాబోయే ఐదు సంవత్సరాలలో అంటే 2022 కల్లా దేశం లో అందరికీ సొంత ఇల్లు ఉండాలి అనే నినాదం తో ముందుకు వెళుతున్న ప్రభుత్వం కేంద్ర బ్యాంకుల నుంచి ప్రోత్సాహకాలు ఇప్పించే ప్రయత్నం చేస్తోంది. ఏడాదికి రూ.18 లక్షల వరకు జీతం ఉండి.. తొలిసారి ఓ ఇల్లు కొనే వారికి హోమ్ లోన్ లో రూ.2.4 లక్షల వరకు భారం తగ్గనుంది. ఇలాంటి గృహరుణాల వడ్డీపై కేంద్రం సబ్సిడీ ఇవ్వనుంది. గతంలో ఈ ఏడాది జీతం నిబంధన రూ.6 లక్షలకే పరిమితం కాగా.. దానిని ఇప్పుడు 18 లక్షలకు పెంచింది. అయితే గతంలో 15 ఏళ్ల పరిమితి ఉన్న గృహరుణాలపై ఈ ఆఫర్ ఉండగా.. ఇప్పుడు దానిని 20 ఏళ్లకు పెంచారు.ఇలాగే ఏడాదికి రూ.12 లక్షల వరకు ఆదాయం ఉన్న వారికి వాళ్ల మొత్తం గృహరుణంలో రూ.9 లక్షలపై 4 శాతం వడ్డీని కేంద్రం సబ్సిడీగా ఇస్తుంది. ఇక రూ.18 లక్షల వరకు ఆదాయం ఉన్నవారికి మొత్తం గృహరుణంలో రూ.12 లక్షలకు 3 శాతం వడ్డీని కేంద్రమే భరిస్తుంది.