స్మగ్లర్లకు సహాయం చేస్తే పీడీ ఆక్టే!

Tuesday, September 23rd, 2014, 08:38:01 AM IST


ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖామంత్రి బొజ్జల గోపాల కృష్ణారెడ్డి సోమవారం ఒంగోలులో విలేకరుల సమావేశంలో ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలకు ఎర్రచందనం స్మగ్లర్లను సంబంధాలు ఉన్నాయని, స్మగ్లర్లను కలవడానికి వైకాపా నేతలు జైలుకు వెళుతుంటారని తీవ్ర ఆరోపణలు చేశారు. అలాగే ఎర్ర చందనం దుంగల విక్రయానికి త్వరలోనే ప్రభుత్వం తేదీని ఖరారు చేయనున్నదని బొజ్జల వివరించారు.

ఆయన ఇంకా మాట్లాడుతూ కొంతమంది అధికారులు, స్మగ్లర్ల మధ్య కూడా సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఈ నేపధ్యంగా ప్రభుత్వం ఇద్దరు డీఎస్పీలను సస్పెండ్ కూడా చేసిందని బొజ్జల వివరించారు. అలాగే ప్రభుత్వ అధికారులు గనుక ఎర్రచందనం స్మగ్లర్లతో సంబంధాలు కొనసాగిస్తే పీడీ ఆక్ట్ కింద వాళ్ళపై చర్యలు తీసుకుంటామని మంత్రి బొజ్జల గోపాల కృష్ణా రెడ్డి హెచ్చరించారు.